బాల్య వివాహ రహిత సమాజానికి సమష్టి కృషి
మధురానగర్(విజయవాడసెంట్రల్): బాల్య వివాహ రహిత సమాజం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని, బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ సివిల్ కోర్టు సమీపంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, చిల్డ్రన్ హోం ప్రాంగణంలో బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో కలెక్టర్ లక్ష్మీశ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సిగ్నేచర్ క్యాంపయిన్‌ను ప్రారంభించారు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చేసిన చట్టాలు, ప్రభుత్వాలు అమలుచేస్తున్న కార్యక్రమాలు, విధానాల పటిష్ట అమల్లో మహిళాభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్యం, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి డి.శ్రీలక్ష్మి, నోడల్ అధికారి సీహెచ్ సాయిగీత, సీడీపీవోలు జ్యోత్స్న, జి.మంగమ్మ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం.రాజరాజేశ్వరరావు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment