కోడూరుపాడులో ప్రత్యక్షమైన పునుగు పిల్లి
హనుమాన్‌జంక్షన్ రూరల్: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. అటవీ ప్రాంతంలో అధికంగా సంచరించే పునుగు పిల్లి జనావాసాల్లోకి రావటంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రామంలో పిల్లిని పోలిన ఓ వింత జీవి తిరుగుతుండటంతో పట్టుకునేందుకు స్థానికులు యత్నించారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామానికి చెందిన ఆళ్ల భాను దానిని వల సాయంతో పట్టుకుని, తన ఇంట్లోని బోనులో ఉంచారు. ఆ తర్వాత ఈ జంతువును అరుదైన పునుగు పిల్లి అని, కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరునికి ప్రీతి పాత్రమైనదంటూ పలువురు గుర్తించటంతో మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. పునుగుపిల్లి సమాచారాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు గ్రామానికి వచ్చి పునుగు పిల్లిని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment