వినికిడి దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ
మధురానగర్(విజయవాడసెంట్రల్): చిన్న పిల్లల్లో వినికిడి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వారి ఆరోగ్యకర జీవితానికి మంచి పునాది వేయవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినికిడి సమస్యలకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి వైద్యాధికా రులు, ఏఎన్‌ఎం, ఆశాలు, అంగన్‌వాడీ కార్య కర్తలు తదితరులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో ఎం.లక్ష్మీనర సింహం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, సీపీఓ వై.శ్రీలత, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, పీఓ–యూసీడీ వెంకటరత్నం, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, ఎన్‌సీడీ కార్యక్రమం అధికారి డాక్టర్ మాధవి నాయుడు, ఎల్‌డీఎం కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment