ముగిసిన బ్రహ్మోత్సవాలు
పెదకళ్లేపల్లి(మోపిదేవి): దక్షిణకాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలో వేంచేసియున్న శ్రీ దుర్గ,పార్వతి సమేత నాగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత నెల 23 నుంచి సోమవారం వరకు స్వామివారి మహాశివరాత్రి, వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రాత్రి ఎని మిది గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం పుష్పశయ్యాలంకృత పవళింపు సేవతో ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఉత్సవాలను జయప్రదం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులసంఘం డైరీ ఆవిష్కరణ
చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 2025 డైరీని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సోమవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సంద్భంగా ఉద్యోగులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించా లన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నతస్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు పి.రాము, కార్యదర్శి తోట వరప్రసాద్, సంఘ నాయకుడు ఎస్.రాంబాబు పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి
రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సోమ వారం రూ.లక్ష విరాళం సమర్పించారు. దామోదర్ (తంబి) పేరిట పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దామోదర్‌కు తన వాళ్లు ఎవరూ లేకపోవడంతో తాము చేరదీశామని, ఆయన అమ్మవారి భక్తుడు కావడం, కొంత డబ్బు దాచుకోవడంతో వాటిని అన్నదానానికి విరాళంగా అందజేసినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమ వారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 103 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 36,392 మంది విద్యార్థులకు 35,813 మంది పరీక్షకు హాజరయ్యారు. 579 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొలి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ భాషల పరీక్ష జరిగింది. ఇంటర్మీడియెట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శారద నగరంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, సదుపాయాలను పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల పార్శిల్ విభాగం, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. జిల్లా అధికారి సి.ఎస్.సత్య నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
ముగిసిన బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment