బ్యారక్‌ మార్చాలన్న వంశీ పిటీషన్‌పై కౌంటర్‌కు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

బ్యారక్‌ మార్చాలన్న వంశీ పిటీషన్‌పై కౌంటర్‌కు నోటీసులు

Published Tue, Mar 4 2025 3:20 AM | Last Updated on Tue, Mar 4 2025 3:20 AM

-

విజయవాడలీగల్‌: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జిల్లా జైలులో తనను బ్యారక్‌ మార్చాలని దాఖలు చేసిన పిటీషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వంశీ పిటీషన్లో బ్యారక్‌ను మార్చడం కుదరకపోతే తనకు ఆస్తమా, ఆరోగ్య సమస్యలు ఉన్నందున బ్యారక్‌లో తనకు తోడుగా మరొకరిని ఉంచాలని న్యాయమూర్తిని కోరిన సంగతి విదితమే.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 17 వరకు రిమాండ్‌

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పిటి (ప్రిజనర్‌ ట్రాన్సిట్‌) వారెంటు కోరుతూ సీఐడీ పోలీసులు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో వంశీని జిల్లా జైలు నుంచే వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. వాదనల అనంతరం ఈనెల 17వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. ఇద్దరు నిందితులకు రెండు రోజుల కస్టడీ సత్యవర్థన్‌ను భయపెట్టి, కిడ్నాప్‌ చేసిన కేసులో వంశీతో పాటు అరెస్టు అయి రిమాండ్లో ఉన్న వీర్రాజు, వంశీబాబులను పదిరోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటీషన్‌ వేశారు. పిటీషన్‌పై జరిగిన వాదనల అనంతరం ఇరువురిని మంగళ, బుధవారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఎస్సీ ఎస్టీ స్పెషల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్న పోలీసులు

వంశీ బెయిల్‌ కోరుతూ వేసిన పిటీషన్‌కు కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ, పోలీసులు సమయం కోరుతూ కౌంటర్‌ దాఖలు చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. నిన్న జరిగిన బెయిల్‌ పిటీషన్‌పై జరిగిన విచారణ సందర్భంగా ఈరోజు కౌంటర్‌ దాఖలుచేయనున్నట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement