యువ ఆగ్రహ జ్వాల
ఎన్నికల హామీల అమలులో మాటతప్పిన కూటమి ప్రభుత్వ తీరుపై యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా లెక్క చేయలేదు. లాఠీలు ఝులిపించినా వెనక్కు తగ్గలేదు. విజయవాడలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరులో విద్యార్థులు, నిరుద్యోగులు, యువతీయువకులు పాల్గొని కదం తొక్కారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, విద్యాదీవెన, నిరుద్యోగ భృతి చెల్లించాలని, డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నినదించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, విద్యా దీవెన, నిరుద్యోగ భృతి అమలుచేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన యువత పోరుకు విశేష స్పందన లభించింది. యువత పోరులో విద్యార్థులు, యువతీయువకులు, తల్లిదండ్రులు, మహిళలు కదం తొక్కారు. విజయవాడలోని కలెక్టరేట్‌కు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. కోర్టు సెంటర్‌లోని సీవీఆర్ స్కూల్ నుంచి మ్యూజియం రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడుగుడుగునా నిర్బంధాలు విధించినా ఛేదించి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలపై కన్నెర్ర జేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించాలని, డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వ మోసాలపై కన్నెర్రజేసిన యువత
యువత పోరుకు వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు, విద్యార్థులు పోలీసు నిర్బంధాలను దాటుకుని కలెక్టరేట్‌కు చేరుకున్న వైనం కూటమి ప్రభుత్వానిది దుర్మార్గపు పాలన : దేవినేని అవినాష్
యువ ఆగ్రహ జ్వాల
యువ ఆగ్రహ జ్వాల
Comments
Please login to add a commentAdd a comment