ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పేర్లు నమోదు చేసుకోవాలి
పెనమలూరు: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వివిధ రాయితీలు పొందటానికి ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో వారు పేర్లు నమోదు చేసుకోవాలని కృష్ణా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకట్రావు సూచించారు. కానూరు ఆటోనగర్ క్లస్టర్ భవనంలో గురువారం ఉద్యం రిజిస్ట్రేషన్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీఎం వెంకట్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న పరిశ్రమల వృద్ధిలో భాగంగా ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) సెక్టార్ అభివృద్ధికి చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు, రుణ సదుపాయం లబ్ధిపొందాలంటే ఉద్యం రిజి స్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరని తెలిపారు. పారి శ్రామికవేత్తలు, వ్యాపారులు తమ యూనిట్లకు సంబంధించి ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లు తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ క్లస్టర్ ఎండీ అన్నే శివనాగేశ్వరరావు, డైరెక్టర్లు, పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment