రేపు సిద్ధార్థలో ‘ఇన్‌కెండో–2కే25’
పోస్టర్‌ను ఆవిష్కరించిన కళాశాల ప్రతినిధులు, విద్యార్థులు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కామర్స్ కోర్సు చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు తమ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ బుధవారం ఇన్‌కెండో–2కే25 పేరుతో పాఠ్యాంశాలు, సాంకేతిక అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నామని సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ చెప్పారు. కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 2010 నుంచి ఇన్‌కెండో పేరుతో కామర్స్ విద్యార్థులకు పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు క్విజ్, దలాల్ స్ట్రీట్, ఫైనాన్షియల్ ఎనలిస్ట్, యాడ్ మేడ్, డ్యాన్స్ టు ట్రిబ్యూట్, మిస్టర్ అండ్ మిస్ ఇన్‌కెండో, ఇన్‌కెండో ప్రీమియర్ లీగ్ వంటి అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు, తెనాలిలోని కళాశాలల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కళాశాల కామర్స్ విభాగాధిపతి కోనా నారాయణరావు, కళాశాల డీన్ రాజేష్ సి. జంపాల, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment