మచిలీపట్నం చేరుకున్న సీఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

మచిలీపట్నం చేరుకున్న సీఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ ర్యాలీ

Published Fri, Mar 21 2025 2:08 AM | Last Updated on Fri, Mar 21 2025 2:03 AM

మచిలీపట్నం చేరుకున్న సీఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ ర్యాలీ

మచిలీపట్నం చేరుకున్న సీఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ ర్యాలీ

చిలకలపూడి(మచిలీపట్నం): దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన భద్రతను అందిస్తున్న పారా మిలటరీ దళమైన కేంద్ర పారిశ్రామిక భద్రత దళం సీఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ ర్యాలీ గురువారం సాయంత్రం మచిలీపట్నం చేరుకుంది. జెడ్పీ కన్వెన్షన్‌ హాలులో అడిషనల్‌ ఎస్పీ సి.సత్యనారాయణ ఈ సైకిల్‌ ర్యాలీ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన అభినందన సభలో బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సీఐఎఫ్‌ డెప్యూటీ కమాండెంట్లు హ్రిషబ్‌, ప్రభాకర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సీఐఎస్‌ఎఫ్‌ను స్థాపించి ఈ నెల పదో తేదీ నాటికి 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సురక్షిత తీరం – సమృద్ధి భారత్‌’ పేరుతో ఆరు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీర ప్రాంతంలో దేశ భద్రత, సమైఖ్యతను పెంపొందించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల ఏడో తేదీన పశ్చిమబెంగాల్‌లోని బఖ్ఖలి నుంచి 60 మంది సభ్యులతో తమిళనాడులోని కన్యాకుమారి వరకు సముద్ర ప్రాంతం గుండా ఈ ర్యాలీ కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు శ్రీనివాస్‌, శిఖర్‌ లోహియా, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement