గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని పార్టీ అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా చిరుమామిళ్ల శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా శిరంశెట్టి పూర్ణచంద్రరావు, బూదాల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కన్నమాల శామ్యూల్, ఎస్సీ సెల్ కార్యదర్శులుగా కన్నెగంటి జీవరత్నం, కొమ్ము చంటిబాబు, జాయింట్ సెక్రటరీగా చింతగుంట విజయ ఆనంద కుమార్, రాష్ట్ర వలంటీర్స్ వింగ్ కార్యదర్శిగా బొమ్మన శివ శ్రీనివాస్, బూత్ కమిటీస్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా చిలుకూరి ఉమా మహేష్, వీవర్స్ వింగ్ అధికార ప్రతినిధిగా పెంటి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా మావారి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఫిట్–1 జర్మన్ పరీక్షలో నూరుశాతం ఉత్తీర్ణత
మధురానగర్(విజయవాడసెంట్రల్): చైన్నె గోధే ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఫిట్–1 జర్మన్ భాష పరీక్షలో కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధించడం సంతో షంగా ఉందని విద్యాలయం ప్రిన్సిపాల్ ఎస్.ఆదిశేషు శర్మ పేర్కొన్నారు. మధురానగర్ కేంద్రీయ విద్యాలయంలో ఫిట్–1 జర్మన్ భాష పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు గురువారం సర్టిఫికెట్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆదిశేషు శర్మ మాట్లాడుతూ.. పరీక్షలు రాసిన 36 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందన్నారు. జర్మన్ భాషా ఉపాధ్యాయిని కారుమంచి రత్న స్వరాజ్ విద్యార్థులను విజయానికి నడిపించడంలో కీలకపాత్ర వహించారని కొనియాడారు.