
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 517.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది.
కనులపండువగా..
దుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారికి శ్వేత, హరిత వర్ణ పుష్పాలతో అర్చన చేశారు.
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నిత్యాన్నదానానికి బాపట్ల జిల్లా కావూరుకు చెందిన తుమ్మల సాయి రాఘవ్ రూ. లక్షను విరాళంగా సమర్పించారు.
–8లోu
మళ్లీ గ్రాఫిక్స్ చేస్తున్నారు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి సర్కారు విజయవాడ అభివృద్ధిపై అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. అంతా ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణ చూపడం లేదు. ఫలితంగా నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతోంది. ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు పది నెలలు గడుస్తున్నా నగరానికి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా 90శాతానికి పైగా పూర్తయిన వెస్ట్ బైపాస్ ను అందుబాటులోకి తేవడంలో విఫలమైంది. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కీలకమైన తూర్పు బైపాస్‌ను అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కోసం వదిలేసింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ స్మృతి వనం, కృష్ణమ్మ జలవిహార్ వంటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది.
గతంలోనూ అంతే..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి బెజవాడ అభివృద్ధిపై శీత కన్ను వేస్తూనే ఉంది. ప్రచార ఆర్భాటం తప్ప.. చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2014–19 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో విజయవాడలో వర్షం నీటి మళ్లింపునకు సంబంధించి రూ.440కోట్లు మంజూరు చేసి, పనులు ప్రారంభించినా పూర్తి చేయడంలో విఫలమైంది. కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో జాప్యం చేసింది. కీలక వంతెనల నిర్మాణం పై దృష్టి సారించలేదు. అదిగో ఇదిగో మెట్రో రైలు ప్రాజెక్టు అంటూ కాలయాపన చేసింది. గ్రేటర్ విజయవాడ అంటూ తెరపైకి తెచ్చినా ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడూ అదే తీరు..
ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం విజయవాడను చిన్నచూపు చూస్తోంది. గ్రాఫిక్స్‌లతో కనికట్టు చేస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. గత ఏడాది బుడమేరు వరదలతో బెజవాడ విలవిల్లాడింది. బుడమేరును మొదటి దశలో రూ.500 కోట్లతో అభివృద్ధి చేస్తామని, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఊదరగొట్టినా, ఆచరణలో అమలుకు మాత్రం నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ పాత పాటే ఎత్తుకుని, మైట్రో రైలు ప్రాజెక్టు, గ్రేటర్ విజయవాడ అంటూ మరోసారి నగర వాసులను మభ్యపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా గ్రాఫిక్స్ చూపిస్తారే తప్ప అభివృద్ధి కనిపించదు. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు అంటూ మరలా గ్రాఫిక్స్‌కు తెరతీశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంచి పనులు చేశారు. ఐదేళ్లలో కరకట్ట రిటైనింగ్ వాల్, ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి చేశారు. నగరంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పార్క్‌లు అభివృద్ధి చేశారు.
– తిరుపతిరెడ్డి, కృష్ణలంక
నాటి అభివృద్ధి ఏది..
గత ప్రభుత్వ హయాంలో రూ. కోట్లు వెచ్చించి నగరంలోని మౌలిక సదుపాయాలపై నాటి పాలకులు దృష్టి సారించారు. పార్కులు, రోడ్లు, బ్రిడ్జిలు వంటి అనేకమైన సౌకర్యాలను కల్పించారు. విజయవాడ నగరం దేశంలోని క్లీన్‌సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందటమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన పురస్కారాలు అందుకుంది. కానీ నేటి కూటమి ప్రభుత్వం మళ్లీ గ్రాఫిక్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రణాళికలు చేస్తోంది.
– యాలంగి బాలచంద్రరావు, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి
7
న్యూస్‌రీల్
కూటమి అధికారం చేపట్టి తొమ్మిది నెలలైనా అందుబాటులోకి రాని వెస్ట్ బైపాస్ తూర్పు బైపాస్‌కు మంగళం గ్రేటర్ విజయవాడకు పడని అడుగులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే కీలక ప్రాజెక్టుల నిర్మాణం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కీలక ప్రాజెక్టులు..
విజయవాడ అభివృద్ధికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కీలక అడుగులు పడ్డాయి. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను పూర్తి చేశారు. కీలక బెంజిసర్కిల్ మొదటి ఫ్లై ఓవర్‌కు సంబంధించిన మధ్యలో నిలిచిన పనులు పూర్తి చేసి, రెండో ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి, రికార్డు సమయంలో పూర్తి చేశారు. సుందర నగరంగా తీర్చి దిద్దేందుకు భాగంగా గ్రీనరీ, కాలువ గట్లను అభివృద్ధి చేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కరంగా రిటైనింగ్ వాల్‌ను నిర్మించారు. నదీతీరంలో ఆహ్లాదకరంగా పార్కును తీర్చిదిద్దారు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించారు. కొండ ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేశారు. ఎయిర్‌పోర్టు కారిడార్‌ను అందంగా తీర్చి దిద్దారు. పలుపార్కులను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునికీకరించారు.
నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు ఏర్పాటు చేసిన వెస్ట్ బైపాస్ నిర్మాణం గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయింది. అక్కడక్కడ అరకొరగా పనులు నిలిచిపోయాయని అంటున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోంది. వెస్ట్ బైపాస్‌కు సంబంధించి మిగిలిపోయిన చిన్న చిన్న పనులు వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తెస్తే ప్రజలకు మేలు కలుగుతుంది.
– కృష్ణారెడ్డి, భవానీపురం

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ