
ఉపసంహరించుకోవాలి
పెన్షన్ చట్టం సవరణ బిల్లును తక్షణమే
పటమట(విజయవాడతూర్పు): లక్షలాది మంది పెన్షనర్స్‌కు నష్టం చేకూర్చే ప్రమాదకరమైన పెన్షన్ చట్టాన్ని సవరిస్తూ పార్లమెంటులో పెట్టిన సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత ఉద్యోగులు, అధికారుల సంఘాల ప్రతినిధులు గురువారం స్థానిక గాంధీ కాలనీలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షన్ పరిష్కార కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్ టెలికం పెన్షనర్స్ అసోసియేషన్, ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సంచార నిగం పెన్షనర్స్ అసోసియేషన్, ఆలిండియా రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కృష్ణా ్జల్లా సర్కిల్ పరిధిలో ఉన్న పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ తారా చంద్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వి. వర ప్రసాద్, సర్కిల్ కార్యదర్శి ఎన్. రామారావు మాట్లాడుతూ ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టం అయితే దేశంలోని సీనియర్ పెన్షనర్లు అందరూ రిటైర్డ్ అయినప్పటికీ ఫిక్స్ అయిన పెన్షన్ తప్ప ఎటువంటి మార్పులకు అవకాశం లేక హీనమైన జీవితం గడపాల్సి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు ఎం. వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, పి. ఆనంద బాబు, ఏ చంద్ర శేఖర్, సి. భాస్కరరావు, మాధవరావు, తాజారావు, కేఎస్ బోస్ తదితరులు పాల్గొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్స్ డిమాండ్