ప్రజల సంక్షేమమే వైఎస్సార్ సీపీ అజెండా
● ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ● అన్ని నియోజకవర్గాల్లో వేడుకలు ● వైఎస్సార్ విగ్రహాల వద్ద నివాళులర్పించిన నాయకులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన విజయవాడతోపాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు పార్టీ జెండాలను ఎగురవేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివా ళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే వైఎస్సార్ సీపీ అజెండా అని పార్టీ నాయకులు స్పష్టంచేశారు.
ప్రజల కోసం పనిచేద్దాం
సమస్యలు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ వైఎస్సార్ సీపీ నిరంతరం ప్రజలకు అండగా నిలుస్తోందని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతకాలను ఎగరవేసి, కేక్‌లుకట్ చేశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో..
గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా, తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ పార్టీ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్‌కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ ఇన్‌చార్జి వెల్లంపల్లి శ్రీనివాస్, తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పీఏసీ మెంబర్ షేక్ ఆసీఫ్, పార్టీనేత పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ సెంట్రల్‌లో..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బీసెంటు రోడ్డులో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే, పార్టీ సెంట్రల్ ఇన్‌చార్జి మల్లాది విష్ణు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేక్‌కట్‌చేశారు. సత్యనారాయణపురంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
విజయవాడ వెస్ట్‌లో...
వన్‌టౌన్ బ్రాహ్మణవీధిలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెస్ట్ ఇన్‌చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మైలవరంలో...
ఇబ్రహీంపట్నం రింగ్‌సెంటర్‌లో మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని జోగి రమేష్ ఎగురవేశారు.
జగ్గయ్యపేటలో...
జగ్గయ్యపేటలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేక్‌కట్‌చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నందిగామలో...
వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం నందిగామలో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మొండితోక జగన్మోహనరావు పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్‌కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరువూరులో..
తిరువూరు టౌన్‌పార్టీ అధ్యక్షుడు చలమల సత్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నగర పంచాయితీ చైర్‌పర్సన్ కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమమే వైఎస్సార్ సీపీ అజెండా
ప్రజల సంక్షేమమే వైఎస్సార్ సీపీ అజెండా
Comments
Please login to add a commentAdd a comment