పీ4 సర్వేతో ప్రతి గృహానికి లబ్ధి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (పీ4) సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి చేకూరుతుందని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. బుధవారం తన చాంబర్‌లో ప్రణాళిక శాఖ రూపొందించిన అవగాహన, క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర: 2047 దిశగా ముందుకు వెళుతుందన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ విలువైన అభిప్రాయాన్ని స్వచ్ఛాంధ్ర వెబ్ సైట్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా అందజేయాలని, అందుకు ఈనెల 25 వరకు ప్రజల భాగ స్వామ్య, సంప్రదింపు కాల పరిమితిగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కె.కర్ణమ్మ నాయుడు, సీపీఓ శ్రీలత, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ/వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీపీఓ లావణ్యకుమారి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయకుమారి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
బ్లడ్ బ్యాంక్‌లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సూర్యారావుపేలోని చిగురుపాటి మంజువాణి వరప్రసాద్ లయన్స్ డిస్ట్రిక్ట్ 316 బ్లడ్ బ్యాంకులో ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఎయిడ్స్ అండ్ టీబీ నివారణ అధికారి డాక్టర్ జె.ఉషారాణితో కలిసి బ్లడ్ బ్యాంకులో నిల్వ ఉన్న రక్తం యూనిట్లు, రక్తం నిల్వలకు అనుసరించాల్సిన నియమ నిబంధనలను పరిశీలించారు. నిబంధనలు కచ్చి తంగా పాటించాలని సూచించారు.
ఎన్టీటీపీఎస్ బూడిదకు టెండర్లు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ బూడిద అక్రమ వ్యాపారంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆ సంస్థ ఉన్నతా ధికారులు స్పందించారు. చెరువులో బూడిద నిల్వలను టెండర్ ద్వారా విక్రయించడం ఉత్తమ మార్గమనే నిర్ణయానికి వచ్చారు. గత నెల రెండో తేదీన ‘బూడిదలో కాసుల వేట’ పేరుతో ‘సాక్షి’లో కథనం వెలువడింది. అప్పట్లోనే ఈ అంశంపై విజిలెన్స్ అధికారులు ఎన్టీటీపీఎస్ అధికారుల నుంచి రాతపూర్వక వివరణ తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ల స్థాయిలో సమావేశం నిర్వహించి టెండర్ వైపు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఏపీ జెన్‌కో అధికారులు రూ.150 కోట్ల అంచనాలతో మూడేళ్ల కాలానికి టెండర్లు పిలిచారు. వార్శిక ఆదాయం రూ.400 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు టెండర్‌లో పాల్గొనే హక్కు కల్పించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెండర్‌లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. 26వ తేదీన టెండర్లు ఓపెన్‌చేసి కేటాయింపులు చేస్తారు. ఏప్రిల్ ఒకటి నుంచి టెండర్‌దారుడు బూడిద సేకరించే అవకాశం ఇస్తారు. ‘సాక్షి’ కథనంతో బూడిద అక్రమార్కులకు చెక్ పెట్టడంతో పాటు జెన్‌కో సంస్థకు ఆదాయం సమకూరనుంది.
పీ4 సర్వేతో ప్రతి గృహానికి లబ్ధి
పీ4 సర్వేతో ప్రతి గృహానికి లబ్ధి
Comments
Please login to add a commentAdd a comment