యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
ఇబ్రహీంపట్నం: ఫెర్రీ వద్ద కృష్ణానది గర్భంలో యథేచ్ఛగా ఇసుక తవ్వి తరలిస్తున్న ఇసుకాసురులపై మైనింగ్ అధికారులు బుధవారం మెరుపుదాడి చేశారు. మైనింగ్ ఏడీ వీరాస్వామి నేతృత్వంలో జరిగిన దాడిలో అనుమతులు లేకుండా కృష్ణానదిలో డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్న పది పడవలు, 24 ట్రాక్టర్లు, 18 మ్యాన్యువల్ క్రేన్‌లను సీజ్‌చేశారు. సీజ్ చేసిన ట్రాక్టర్లను పోలీస్ బందో బస్తు నడుమ స్థానిక ఆర్టీసీ డిపో వద్దకు తరలించారు. ట్రాక్టర్లు, పడవలు, క్రేన్‌ల డ్రైవర్లపై కేసులు నమోదుపై పోలీస్‌లకు రిపోర్ట్ చేశారు.
కూటమి నేతల మాటల యుద్ధం
అక్రమ రవాణా అడ్డుకున్న మైనింగ్ అధికారులపై కూటమి నేతలు మాటల యుద్ధానికి దిగారు. బీసీ నాయకుడిగా చలామణీ అవుతున్న ఒకరు ట్రాక్టర్ డ్రైవర్లు, పడవల యజమానుల తరఫున మైనింగ్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘ప్రభుత్వం మాది. మా అధినేత ఉచి తంగా ఇసుక తీసుకెళ్లమన్నారు. అపడానికి మీరెవరు?’ అంటూ రెచ్చిపోయారు. మైనింగ్ ఏడీ వీరాస్వామి వెనక్కు తగ్గక పట్టుబడిన ట్రాక్టర్లు, పడవలు, క్రేన్‌లను సీజ్ చేశారు.
అనుమతులు లేవు
మైనింగ్ ఏడీ వీరాస్వామి మాట్లాడుతూ.. పడ వలు, ట్రాక్టర్లు, క్రేన్‌ల యజమానుల వద్ద ఇసుక తవ్వకాలు, రవాణాకు అనుమతులు లేవన్నారు. ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను సీజ్‌చేశామని పేర్కొన్నారు. యజమానులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. ఆర్‌ఐ శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాౖపైమెనింగ్ అధికారుల దాడి 24 ట్రాక్టర్లు, 18 క్రేన్‌లు, 10 పడవలు సీజ్
యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
Comments
Please login to add a commentAdd a comment