అడుగడుగునా అడ్డంకులు
యువత పోరుకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. మ్యూజియం రోడ్డులో నాలుగు చోట్ల బారికేడ్లు ఏర్పాటుచేసి కలెక్టరేట్‌కు వెళ్లకుండా యువతీయువకులను అడ్డుకున్నారు. కొందరు పోలీసులు విద్యార్థులపై లాఠీలు ఎత్తారు. తోపులాటలో మహిళలు కింద పడిపోయారు. కలెక్టరేట్ గేట్లు వేసి మరీ లోపలికి ఎవరిని వెళ్లకుండా అడ్డుకున్నారు. నాయకులను సైతం నిలిపివేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్‌మోహన్‌రావు, తిరువూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు నలగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు కలెక్టరేట్‌కు చేరుకుని డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంనకు వినతి పత్రం అందజేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజ, బెల్లం దుర్గ, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పూనూరు గౌతంరెడ్డి, అడపా శేషు, షేక్ ఆసిఫ్, పోతిన వెంకటమహేష్, అవుతు శ్రీనివాసరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment