అవమాన భారంతో రోడ్డెక్కిన విద్యార్థులు
యువత పోరును ఉద్దే శించి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలకు ఎన్నో హామీలిచ్చారని గుర్తుచేశారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, అమ్మకు వందనం పేరుతో ఒక్కొక్క విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఊదరగొట్టి, అధికారంలోకి రాగానే ఆ హామీలను విస్మరించారని మండిపడ్డారు. ఐదు త్రైమాసికాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థు లపై వత్తిడి చేస్తున్నాయని, విద్యార్థులు అవమానభారంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని పేర్కొ న్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి మూడు నెలలకో సారి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేశారని, క్రమం తప్పకుండా అమ్మ ఒడితో ఆదుకున్నారని గుర్తుచేశారు. పది నెలల కూటమి పాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, మహిళలకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
అవమాన భారంతో రోడ్డెక్కిన విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment