గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి | - | Sakshi
Sakshi News home page

గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి

Published Thu, Mar 13 2025 11:24 AM | Last Updated on Thu, Mar 13 2025 11:23 AM

గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి

గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు లబ్ధి చేకూరుస్తోందని, దీనిని వినియోగించుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ, పట్టణ) 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 09 విడుదల చేసిందన్నారు. బుధవారం కలెక్టర్‌ లక్ష్మీశ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు, పీవీటీజీ(పర్వత ప్రాంత షెడ్యూల్‌ తెగలు)లకు రూ.లక్ష అదనపు సాయం అందిస్తామన్నారు. ఎస్సీలకు ఇప్పటికే 3,822 ఇళ్లు, ఎస్టీలకు 556 ఇళ్లు, బీసీలకు 4,018 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, ఆపై దశలో ఉన్నాయని తెలిపారు. వీరితో పాటు మిగిలిన లబ్ధిదారులు కూడా రూ.1.80 లక్షల యూనిట్‌ విలువకు అదనంగా ప్రభుత్వం కొత్తగా అందించే అదనపు మొత్తాన్ని ఉపయోగించుకొని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలన్నారు.

15 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌

ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించి వడివడిగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తిచేసుకునేలా ఈ నెల 15వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డ్‌ అమెనిటీ సెక్రటరీలు తదితరులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. మీడియా సమావేశంలో గృహ నిర్మాణ పీడీ ఆర్‌.లీలారాణి, డీఈ విజయబాబు, ఈఈ జి.కపూర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement