వాట్సాప్ ద్వారా ఓపెన్ టెన్త్ హాల్ టికెట్లు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈ నెల 17 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు వాట్సాప్, వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను పొందవచ్చని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు తెలిపారు. స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లు ఏపీ ఓపెన్ స్కూల్ వెబ్‌సైట్ నుంచి విద్యార్థుల హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చన్నారు. అలాగే విద్యార్థులు మన మిత్ర యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను పొందవచ్చని తెలిపారు. అలాగే 95523 00009 నంబర్‌కు హెచ్‌ఐ అనే సందేశాన్ని పంపి ఇతర ఆప్షన్లను ఎంపిక చేసుకొని హల్ టికెట్లను పొందవచ్చని తెలిపారు.
ఓపెన్ ఇంటర్ పరీక్షలకు
312 మంది గైర్హాజరు
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి బుధవారం జరిగిన పరీక్షకు 312 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17 పరీక్ష కేంద్రాల్లో 1,325 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 1,013 మంది హాజరయ్యారు. నగరంలోని బీఎస్‌ఆర్‌కే ఎంసీ స్కూల్, గాంధీజీ హైస్కూల్, ఏపీఎస్‌ఆర్‌ఎం ఎంసీ హైస్కూల్ పరీక్ష కేంద్రాలను డీఈవో సుబ్బారావు పరిశీలించారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, విజయవాడ పరీక్ష కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించాయి.
మెబాజ్‌లో తారల సందడి
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ బందర్ రోడ్డులోని ఎథ్నిక్ ఫ్యాషన్, విలాసవంతమైన డిజైనర్ వెడ్డింగ్ వేర్ మెబాజ్‌లో బుధవారం తారలు సందడి చేశారు. ప్రముఖ నటులు వర్షిణి సౌందరరాజన్, ప్రీతి సుందర్, జగదీష్‌లు హాజరై కొత్త వివాహ సంకలనాన్ని ఆవిష్కరించారు. వధువుల లహంగాలు, రాజసమైన షేర్‌వానీలు ధరించి సందడి చేశారు. వారిని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. వివాహ సీజన్‌ల సందర్భంగా కళాత్మకమైన వెడ్డింగ్ డిజైనర్స్ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment