జన జాతరకు వేళాయె
నేటి నుంచి తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ప్రారంభం
ఉత్సవ కాంతులు.. విద్యుత్ దీపాలంకరణలతో మెరిసిపోతున్న తిరుపతమ్మవారి ఆలయం
పెనుగంచిప్రోలు: భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు కొనసాగనున్న ఈ తిరునాళ్ల ఉత్సవాలకు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, నల్గొండ జిల్లాల నుంచే కాక ఉభయగోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్‌కుమార్ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా ముస్తాబు చేశారు.
ఉత్సవాలు ఇలా..
మార్చి14న ఉదయం 6.02 గంటలకు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిన అఖండ జ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవనున్నాయి. 15న సాయంత్రం 6.56 గంటలకు గ్రామంలో ఉత్సవమూర్తుల రథోత్సవం, 16న రాత్రి 9.05గంటలకు 90 అడుగుల దివ్య ప్రభోత్సవం, 17న సాయంత్రం 4.53గంటలకు చిన్న తిరునాళ్లల్లో ప్రధాన ఘట్టమైన తిరుపతమ్మ పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు– కుంకుమల బండ్లు పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటాయి. 18న ఉదయం 5.30 గంటల నుంచి భక్తుల బోనాల సమర్పణతో తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి.
జల్లు స్నానాలు..
తిరునాళ్ల ఐదు రోజుల ఉత్సవాలకు మునేరు నీరు లేనందున షవర్ బాత్‌లు 300 ఏర్పాటు చేస్తున్నారు. తాత్కాలిక టాయిలెట్లు 50, వాటర్ ట్యాంక్‌లు, చేతి పంపులు, మునేరులో తాత్కాలిక కేశఖండన శాల, ఆలయం చుట్టూ చలివేంద్రాలు, వాటర్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచుతున్నారు.
జన జాతరకు వేళాయె
Comments
Please login to add a commentAdd a comment