వర్డ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఎస్‌సీఈఆర్‌టీ, విభా, లీప్ ఫార్వర్డ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో భవానీపురంలోని బెరంపార్క్‌లో గురువారం వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెల్‌బీ తరహాలో దేశంలోని ప్రాంతీయ భాషా పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన ఏకై క ఆంగ్ల పోటీ ఇది అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను సులభతరం చేయడమే ఈ కార్యక్రమ ఉద్ధేశ్యమన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ పోటీని ఏడు జిల్లాల్లో ఐదుస్థాయిల్లో నిర్వహించామని తెలిపారు. విజేతలు ఏప్రిల్ నెలలో ముంబైలో జరిగే ఇంటర్ స్టేట్ గ్రాండ్ ఫైనల్‌ల్లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో విభా సౌత్ ఇండియా మేనేజర్ టి.వీరనారాయణ, లీప్ ఫార్వర్డ్ టీమ్ ప్రతినిధి ప్రణిల్‌నాయక్, శ్వేత, విజయకుమార్, సమగ్ర శిక్ష నుంచి జి.అపర్ణ, డాక్టర్ శారద, శైలా కల్పన తదితరులు పాల్గొన్నారు.
ఆశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభానికి సన్నాహాలు
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన ఆశోక్ లేల్యాండ్ బస్ బాడీ బిల్డింగ్ తయారీ పరిశ్రమను ఈనెల 19వ తేదీన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి. సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బస్‌బాడీ బిల్డింగ్ తయారీ యూనిట్‌లో ఇటీవలే పెండింగ్ పనులను పూర్తి చేయడంతోపాటుగా ట్రయన్ రన్ నిర్వహించారు. ఈ యూనిట్‌లో అత్యాధునిక సాంకేతికత, బీఎస్–6 నాణ్యాత ప్రమాణాలతో బస్సులను తయారు చేయనున్నారు. ఈ ప్లాంట్ ఏటా 4800 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో 5000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనుందని ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి.
రూ.49.18 కోట్లతో
రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలోని గూడూరు స్టేషన్ పునరాభివృద్ధి పనులకు రైల్వేమంత్రిత్వశాఖ రూ.49.18కోట్లు నిధులు మంజూరు చేసినట్లు డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. దీంతో గూడూరు స్టేషన్‌లో ప్రపంచస్థాయి అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తిరుపతి, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల ప్రాంతీయ వృద్ధి జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రౌండ్ ప్లస్ టూ అంతస్తులతో స్టేషన్ భవన నిర్మాణం, ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న ప్లాట్‌ఫాంల పొడవు పెంపు, తూర్పు నుంచి పశ్చిమ ప్రవేశ ద్వారం మధ్య 12 మీటర్ల వెడల్పుగల రూఫ్ ప్లాజా, సర్కులేటింగ్ ప్రాంతం అభివృద్ధి తదితర పనులు చేపట్టనున్నట్లు వివరించారు. పనులు పూర్తయితే ఈ స్టేషన్ డివిజన్‌లోనే ఓ ల్యాండ్ మార్కుగా ఉంటుందన్నారు. అమృత్ భారత్ పథకంలో గూడూరు స్టేషన్ కూడా చేరడంలో డివిజన్‌లో మొత్తం 21 రైల్వేస్టేషన్లను రూ.567.41కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు డీఆర్‌ఎం తెలిపారు.
వర్డ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment