ఎమ్మెల్యేల క్రీడా పోటీలకు ఏర్పాట్లు
పటమట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీల నిర్వహణకు నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పటిష్ట ఏర్పాట్లు పూర్తిచేయాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బందరురోడ్డులోని స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి 18 నుంచి 20 వరకు జరిగే శాసనసభ్యుల క్రీడల పోటీల కోసం ఎలాంటి లోపం లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. క్రీడా పోటీల నిర్వహణలో విజయవాడ నగరపాలక సంస్థ నుంచి కావాల్సిన ప్రతి ఏర్పాటును త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి మొదలయ్యే ఈ క్రీడల పోటీలకు, రాత్రిపూట అవసరమయ్యే ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈపర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథరెడ్డి, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్‌బాబు, సూపరిండింటెంగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి. సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment