మాలల తిరుపతి సభకు తరలిరండి
పటమట(విజయవాడతూర్పు): ఈనెల 23న తిరుపతిలో నిర్వహించనున్న మాలల సింహగర్జనకు రాష్ట్రంలోని మాలలందరూ తరలిరావాలని అఖిల భారత మాలల సంఘాల జేఏసీ చైర్మన్, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి డాక్టర్ ఉప్పులేటి దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. గురునానాక్ కాలనీలో సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు, మాలలపై ప్రభుత్వం చేస్తున్న కుట్రను సభలో వివరిస్తామన్నారు. ఈ సందర్భంగా మాలల సింహగర్జన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాయలసీమ మాలల సింహగర్జన గౌరవాధ్యక్షులు చెరుకూరి అశోక్‌రత్నం, సహాయ కార్యదర్శి ఎనుముల రాజ్‌కుమార్, కొప్పెర రాజేంద్ర, మాధవరం రంగస్వామి, జేఎసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment