ఇక్కడే పడవల తయారీ..
నదిలో ఇసుక తవ్వకాలకు అవసరమైన భారీసైజు పడవలను ఫెర్రీలోనే తయారీ చేస్తున్నారు. రెవెన్యూ, జలవనరులు, అగ్నిమాపక శాఖ అధికారుల అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలం కబ్జా చేసి భారీస్థాయిలో పడవలు తయారు చేస్తున్నా.. సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. డ్రెడ్జింగ్ యంత్రాలు కలిగిన ఒక్కొక్క పడవ సుమారు రూ.30నుంచి 35లక్షల వరకు వరకు ధర పలుకుతున్నాయి. తయారైన పడవలు వెంటనే పక్కనే ఉన్న కృష్ణానదిలోకి దించి ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడం ఇక్కడ పరిపాటిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment