విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహరి
(శుక్ర ) (శని)
విజయవాడ 6.22 4.58
మచిలీపట్నం 6.21 4.56
తిరుపతమ్మ సేవలో..
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారిని గురువారం ట్రైనీ ఎీస్పీ మనీషారెడ్డి దర్శించుకుని, పూజలు నిర్వహించారు. డీసీపీ మహేశ్వరరాజు, నందిగామ ఏసీపీ తిలక్ తదితరులున్నారు.
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ కస్తూరిబాయి పేటకు చెందిన మోటూరు శివమోహన్‌రావు, కమలారాణి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణమ్మకు కన్నీటి శోకమే మిగులుతోంది. ఇసుకాసురులు నదీగర్భంలో తూట్లు పొడిచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. విజయవాడకు కూత వేటు దూరంలో ఈ దందా జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తూ.. అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు.
కృష్ణమ్మకు గర్భశోకం..
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణానదిలో అనుమతులు లేకుండా కూటమి నాయకులు భారీ యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు జరపకూడదనే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెట్టి యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి నదీగర్భంలో డ్రెడ్జింగ్ యంత్రాలు వినియోగిస్తున్నారు. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మైనింగ్, రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి దిగుతున్నారు. దీంతో అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. వాల్టా చట్టం ప్రకారం కృష్ణా నదిలో పడవల ద్వారా ఇసుక తవ్వాలంటే పీడబ్ల్యూడీ, జలవనరుల శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అనుమతులు ఉన్నా కూడా నీటి మట్టానికి 3.5మీటర్ల లోతులోనే మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉంది. అయితే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ డ్రెడ్జింగ్ యంత్రాలు కలిగిన పడవలతో నదిలో రిగ్‌బోరు ద్వారా యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. దీంతో నది గర్భంలో పెద్దసైజు గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇటువంటి గుంతలతోనే 2017లో ఫెర్రీ వద్దకు వచ్చిన పర్యాటకుల పడవ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 22 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు.
కూటమి నాయకుల కనుసన్నల్లోనే..
ఇబ్రహీంపట్నం ఫెర్రీ, గుంటుపల్లి గ్రామాల్లో కృష్ణా నది నుంచి ఇసుక తవ్వకాలు కూటమి నాయకులు కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. నెలరోజుల క్రితం నదిలో ఇద్దరు కూటమి నాయకులు రెండు పడవలతో ఇసుక తవ్వకాలు మొదలు పెట్టగా వారికి పోటీగా ఇప్పుడు సుమారు 25పడవల యజమానులు ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. పెద్ద సైజు పడవలో సుమారు 30నుంచి 40ట్రాక్టర్ల ఇసుక తీసుకొస్తున్నారు. చిన్న పడవల్లో 10ట్రాక్టర్ల ఇసుక చేరవేస్తున్నారు. నది ఒడ్డుకు చేరిన పడవల్లోని ఇసుకను 18 మాన్యువల్ క్రేన్‌ల ద్వారా ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్నారు. పడవలు పాడైపోయిన యజమానులు వారి వద్ద ఉన్న క్రేన్, ఆ స్థలం నెలకు రూ.3లక్షల చొప్పున అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.
నది మధ్యలో డ్రెడ్జింగ్ చేసి పడవల్లో ఇసుక లోడ్ చేస్తున్న దృశ్యం
రబీ ధాన్యం
సేకరణకు సన్నద్ధం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో రబీ (2024–25) సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నద్ధంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ మంజీర్ జిలానీ.. రబీ ధాన్యం సేకరణ సన్నద్ధతపై వర్క్‌షాప్‌తో పాటు ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌స్పెక్షన్ మాడ్యూల్, బఫర్ గోదాముల వినియోగం, కాగిత రహిత డిజిటల్ లావాదేవీలు తదితరాలపై వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు పౌర సరఫరాలు, వ్యవసాయం, సహకార, రవాణా తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. రబీ సీజన్ ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చేపట్టాల్సిన చర్యలపై ఎండీ మంజీర్ జిలానీ పలు సూచనలు చేశారు.
లక్ష్యాల మేరకు కొనుగోలు..
అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఖరీఫ్‌కు సంబంధించి 149 రైతు సేవా కేంద్రాల (ఆర్ ఎస్‌కే) ద్వారా 16,353 మంది రైతుల నుంచి దాదాపు రూ. 257 కోట్ల విలువైన 1,10,738 టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇదే విధంగా రబీకి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఈ–పంట నమోదు ఆధారంగా చూస్తే రబీలో 20,422 హెక్టార్లలో వరి వేశారని, 1,60,413 టన్నుల మేర ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశముందని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లక్ష్యాల మేరకు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణకు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఆర్‌డీవోలు, పౌర సరఫరాల డీఎం, డీఎస్‌వో, డీఏవో తదితర అధికారులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, పౌరసరఫరాల డీఎం ఎం.శ్రీనివాసు, డీఎస్‌వో ఎ.పాపారావు, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.
7
న్యూస్‌రీల్
ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు అమలు కాని వాల్టా చట్టం ఇసుక రవాణాకు అనువుగా అక్కడే పడవల తయారీ రోజుకు 500 ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా రూ. లక్షలు దోచుకుంటున్న కూటమి నేతలు
డ్రెడ్జింగ్ యంత్రాలతో
నదీ గర్భానికి తూట్లు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
Comments
Please login to add a commentAdd a comment