కాసారా.. కటకటాలే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజకవర్గంలో నాటుసారా రక్కసి ఎన్నో ఏళ్లుగా వేధిస్తోంది. కల్తీ నాటుసారా తాగి ఎందరో అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎందరో నిరుపేదలు ఆర్థికంగా చితికిపోయి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ అక్రమ, అరాచకపు దందాను నిర్మూలించడంతో పాటు, నాటుసారా మహమ్మారిని రూపుమాపేందుకు మేము సైతం అంటూ ‘సాక్షి’ నడుం బిగించింది. సారా క్రయ, విక్రయాలు.. దానిని తాగడం వల్ల గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న తీరని నష్టంపై ఈ నెల 10వ తేదీ నుంచి ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎకై ్సజ్ శాఖ అధికారులు తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం, విస్సన్నపేట, ఎ. కొండూరు మండలాల్లో మెరుపుదాడులను నిర్వహించారు. నాటుసారా నిర్మూలనకు ‘సాక్షి’ స్పందించిన తీరుపై నియోజకవర్గ ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ముమ్మరంగా దాడులు..
తిరువూరు నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలను కూకటి వేళ్లతో పెకిలించాలని ఉమ్మడి కృష్ణా జిల్లా ఎకై ్సజ్ డీసీ టి. శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సారా తయారీ దారులు, విక్రయదారులపైన నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేసే విధంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎకై ్సజ్ సీఐ జె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు మెరుపుదాడులు జరుపుతున్నారు. మామిడితోటల్లో, అటవీ ప్రాంతాల్లో, ఇళ్ల ప్రాంగణాల్లో నిల్వ ఉంచిన బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్నారు. సారా తయారీ దారులను అరెస్టులు చేస్తున్నారు. పాత నేరస్తులను అదుపులోకి తీసుకొని బైండోవర్‌లు చేస్తున్నారు. సారా విక్రయదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. సారా తయారీ, విక్రయాల వల్ల జరిగే నష్టాలపై గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నారు. నాటుసారాపై నిరంతర నిఘా ఉండేలా టీంలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో నాటుసారా నిర్మూలనకు ఎకై ్సజ్‌శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
గంపలగూడెం మండల పరిధి మేడూరులో బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్న ఎకై ్సజ్‌శాఖ పోలీసులు
సారా తయారీదారులపై అధికారుల వరుస దాడులు బెల్లం ఊటను ధ్వంసం చేసి పలువురిపై కేసులు నమోదు హర్షం వ్యక్తం చేస్తున్న తిరువూరు నియోజకవర్గ ప్రజలు
నాలుగు రోజుల్లో కేసులు ఇవే..
నాటుసారా తయారీ, విక్రయాల వల్ల కలిగే నష్టాలపై ‘సాక్షి’ ఈ నెల 10వ తేదీన ‘సారా ఏరులు’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎకై ్సజ్‌శాఖ అధికారులు అదే రోజు గంపలగూడెం మండల పరిధి అమ్మిరెడ్డిగూడెంలో సారా కాస్తున్న పి. నర్సింహారావు, కొత్తపల్లి గ్రామంలో పి. మోహన్‌రావుని అదుపులోకి తీసుకున్నారు. కనుమూరులో పాత నేరస్తుడు జెర్రి పోతుల కోటేశ్వరరావు, విస్సన్నపేట మండల పరిధిలోని నరసాపురానికి చెందిన పాత నేరస్తులు ఉమ్మడి రాంబాబు, బాణావతు బుజ్జి, కాటూరి చెన్నారావు, వేమిరెడ్డిపల్లి తండాలో అజ్మీరా బాబురావులను బైండోవర్ చేశారు.
ఈ నెల 11న విస్సన్నపేట మండల పరిధిలో పాత నేరస్తులు 8మందిన బైండోవర్ చేశారు. ఈ నెల 12వ తేదీన విస్సన్నపేట మండల పరిధిలోని వేమిరెడ్డిపల్లి తండాలో సారా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న 17మందిని బైండోవర్ చేశారు.
మరలా 13వ తేదీన ‘సారా నిర్మూలనే పల్లెలకు రక్ష’ అనే కథనాన్ని సాక్షి ప్రచురించడంతో ఎకై ్సజ్‌శాఖ అధికారులు నియోజకవర్గంలో పలు చోట్లు మరోసారి దాడులు జరిపి బెల్లం ఊటను ధ్వంసం చేసి కేసులు నమోదు చేశారు. గంపలగూడెం మండల పరిధిలోని మేడూరు గ్రామంలో నిల్వ ఉంచిన 400లీటర్లు బెల్లంఊటను ధ్వంసం చేసి సారా కాసే వ్యక్తితో పాటు బెల్లం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసులు నమోదు చేశారు.
కాసారా.. కటకటాలే!
Comments
Please login to add a commentAdd a comment