జీజీహెచ్‌కి మైక్రోస్కోప్‌లు వితరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): రామవరప్పాడు సర్కిల్ యూనియన్ బ్యాంక్ బ్రాంచి వారు తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రికి రూ. లక్ష విలువైన రెండు అత్యాధునిక మైక్రోస్కోప్‌లను అందజేశారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఉపయోగపడే బైనాక్యులర్ మైక్రోస్కోప్, ట్రైనాక్యులర్ హెడెడ్ బైనాక్యులర్ మైక్రోస్కోప్ విత్ డిజిటల్ కెమెరా ఉన్న వాటిని ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సీహెచ్ నాగార్జున జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావుకు గురువారం అందజేశారు. వాటిని మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావుకు సూపరింటెండెంట్ అందజేశారు. కాగా పరికరాలు బ్యాంకు వారితో అందించేందుకు కృషి చేసిన ల్యాబ్ నోడల్ అధికారి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. శుభాలక్ష్మి, గ్రేడ్–1 ల్యాబ్ టెక్నీషియన్ పి. నాగరాజులను సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అభినందించారు. యూనియన్ బ్యాంకు డెప్యూటీ రీజనల్ హెడ్ బి. హరీష్, రీజనల్ హెడ్ ఎం. శ్రీథర్ డాక్టర్ ప్రసాద్‌బాబు, డాక్టర్ సరితా తదితరులు పాల్గొన్నారు.
వాటర్ డిస్‌స్పేన్సరీ ప్రారంభం..
వేసవి నేపథ్యంలో సీరాలజీ ల్యాబ్‌లో పనిచేసే సిబ్బందికి ఉపయోగపడేలా గ్రేడ్–1 ల్యాబ్ టెక్నీషియన్ పి. నాగరాజు వాటర్ డిస్‌స్పేన్సరీని అందజేశారు. దానిని గురువారం సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment