రోజుకు రూ. 3.5లక్షల ఆదాయం..
కృష్ణానది నుంచి తవ్విన ఇసుకతో కూటమి నాయకులు రోజుకు సుమారు 500 ట్రాక్టర్లు రవాణా చేస్తున్నారు. ప్రతిరోజు 10 పెద్ద సైజు పడవలు, 15 చిన్న సైజుల పడవల ద్వారా రోజుకు సుమారు 500 ట్రాక్టర్ల రవాణా చేస్తున్నారు. పరిసర గ్రామాల నుంచి వచ్చిన ట్రాక్టర్లకు లోడింగ్ చార్జీలు ఒక్కొక్కటి రూ.700 చొప్పున వసూలు చేసి రోజుకు రూ.3.50 లక్షలు సంపాదిస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ.1.05 కోట్లు, ఏడాదికి రూ.12.60 కోట్లు అక్రమ సంపాదన వెనకేసుకునేందుకు కూటమి నేతలు ఇసుక దందాకు పాల్పడుతున్నారు. వీరి ఇసుక అక్రమ రవాణాకు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో మూడుపువ్వులు ఆరు కాయలుగా అక్రమ ఇసుక వ్యాపారం వర్థిల్లుతోంది. అయితే ఇటీవల కూటమి నేతల్లో వచ్చిన ఆధిపత్య పోరుతో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో అధికారులు దాడులు చేయగా కళ్లు చెదిరే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల క్రితం ఇసుక రవాణాకు సిద్ధంగా ఉన్న 24 ట్రాక్టర్లు, లోడింగ్ చేస్తున్న 18 క్రేన్‌లు, ఇసుక ఒడ్డుకు తీసుకొచ్చిన 10 పడవలు సీజ్ చేశారు. ట్రాక్టర్ల డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment