ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు | - | Sakshi
Sakshi News home page

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

Published Sat, Mar 15 2025 1:30 AM | Last Updated on Sat, Mar 15 2025 1:29 AM

ఈ అంశ

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

వినియోగదారుడు లేకపోతే సంస్థలే లేవు. ఈ సున్నిత అంశాన్ని సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. నాణ్యమైన వస్తువులు, సేవలను అందించడంలో మభ్యపెడుతున్నాయి. తూకం, నాణ్యత, సేవల్లో ప్రజలను కుడి ఎడమల దగా చేస్తున్నాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై అవగాహన లేమి కారణంగా మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకుంటే మోసాలకు చెక్‌ పెట్టవచ్చని కన్స్యూమర్‌ ఫోరం సభ్యులు అంటున్నారు.

వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి

అమ్మకం దారుడికి, వినియోగదారుడికి నష్టం జరగకుండా చూడటమే మా శాఖ ముఖ్య ఉద్దేశం చెప్పారు. నిత్యావసరాలను లూజుగా కొనుగోలు చేసేటప్పుడు తూకం విషయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తలు పాటించాలి. వేయింగ్‌ మిషన్‌పై అనుమానం వస్తే ఆ మిషన్‌ సీల్‌ను పరిశీలించాలి. పెట్రోల్‌ బంక్‌లోని మీటర్‌లో జీరో వచ్చిన తర్వాతే పెట్రోల్‌ కొట్టించుకోవాలి. అవసరమైతే 1967 నంబరులో ఫిర్యాదు చేయొచ్చు. –పి.సుధాకర్‌, డెప్యూటీ కంట్రోలర్‌,

తూనికల కొలతల శాఖ, ఎన్టీఆర్‌ జిల్లా

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): మాయా ప్రపంచంలో వినియోగదారుడు తరచూ మోసాల బారిన పడుతూనే ఉన్నాడు. వ్యాపారుల మోసాలకు ఆర్థిక నష్టమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యాన్ని కూడా వినియోగదారులు కోల్పోతూ ఉంటారు. వ్యాపారుల మోసాలకు చెక్‌ పెట్టి వినియోగదారుల హక్కులకు గొడుగు పడుతోంది ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం’. వీటిపై అవగాహన లేకపోవడంతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.

నాణ్యత ఇతర అంశాలపై..

ఉమ్మడి కృష్ణాలో ప్రధానంగా ఎలక్ట్రానిక్‌ వస్తువుల గ్యారెంటీ లేదా వారంటీ గడువులోపు పని చేయకపోవడం, సంస్థ ఇచ్చిన నిర్ణీత సేవలు సరిగా లేకపోవడం, వస్తు నాణ్యతలో తేడా ఉండటం వంటి అంశాలపై కేసులు నమోదవుతున్నాయి. వాటికి తోడు ఆరోగ్య బీమా సంస్థల సేవలపై అధికంగా కేసులు నమోదవుతున్నాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో రియల్టర్‌ అనుకున్న సమయానికి ప్లాట్‌ అందించకపోవడంపై కేసులు నమోదవుతున్నాయి. వాటితో పాటు బ్యాంకింగ్‌ రంగ అంశాలపై ఉమ్మడి జిల్లాలో కేసులు నమోదవుతున్నట్లుగా ఆయా సంస్థల ప్రతి నిధులు వివరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రోజూ 70 నుంచి వంద కిలోలకు పైగా బంగారం విక్రయాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణాలో 1,200 నుంచి 1,500 వరకూ బంగార ఆభరణాల విక్రయ దుకాణాలు పని చేస్తున్నాయి. వీటికి సంబంధించి బంగారం నాణ్యత, తూకంలో చాలా మోసాలు చోటు చేసుకుంటున్నట్లు ఆ రంగంలోని వ్యక్తులు వివరిస్తున్నారు. ఐరన్‌ తూకంలోనూ, ఆహార విషయంలోనూ మోసాలు జరుగుతున్నట్లు సంబంధిత రంగ నిపుణులు చెబుతున్నారు.

ఏ అంశాలపై చట్టంతో ప్రయోజనం పొందొచ్చంటే..

ఆర్థికంగా ప్రతిఫలం చెల్లించి ఏవస్తువునైనా కొనుగోలు చేసిన వ్యక్తి వినియోగదారుడిగా పరిగణించబడతాడు. ఏ సేవలకై నా ప్రతి ఫలాన్ని చెల్లించినా, లేదా ఉపయోగించినా ఈ చట్టం వర్తిస్తుంది. వస్తువును తిరిగి అమ్మకాలు చేసే ఉద్దేశంతో కొనుగోలు చేసిన వ్యక్తిని వినియోగదారుడిగా పరిగణించరు.

సుస్థిరమైన జీవనశైలికి న్యాయమైన పరివర్తన

కుడి ఎడమల దగా...దగా...! ఉమ్మడి కృష్ణాలో నాణ్యత, తూకం, సేవల్లో ప్రజలకు మోసం వినియోగదారులకు అండగాకన్స్యూమర్‌ రైట్స్‌ కృష్ణాలో 683 కేసులు, ఎన్టీఆర్‌ జిల్లాలో 255 కేసులు ఇంకా అవగాహన లేమే.. నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం

ఆహారం, ఎలక్ట్రానిక్స్‌, మందులు, సౌందర్య సాధనాలు, ఆర్థికరంగంలో బ్యాంకింగ్‌ సర్వీసులైన డీడీలు ఇవ్వడం, చెక్కులు మార్చుకోవడం తదితర విధుల్లో జాప్యం జరిగినా, వడ్డీ, లెక్కలు సరిగా లెక్కించకపోయినా తదితర బ్యాంకింగ్‌ సేవల్లో లోపాలు ఈ చట్ట పరిధిలో ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు, రియల్‌ఎస్టేట్‌, స్థానిక సంస్థల నుంచి పొందే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌, మంచినీటి సదుపాయాల కల్పనపై చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా వ్యవహరించే అంశాలపై పరిహారాన్ని పొందవచ్చు. విద్యాసంస్థల్లో అందించే సేవలు, వైద్యుల నిర్లక్ష్యంపై కారణంగా రోగికి జరిగే కష్టనష్టాలకూ ఈ చట్టం పరిహారాన్ని ఇప్పిస్తుంది. జీవిత బీమా పరిహారం చెల్లింపులో సేవా లోపాలు, రోడ్డు రవాణా, పార్సిళ్లు, సేవలు సక్రమంగా లేకపోవడం, పోస్టల్‌ జాప్యం తదితర అంశాలు కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. వ్యాపారుల అనుచిత లేదా అక్రమ వ్యాపార పద్ధతులతో జరిగే నష్టం, హాని కలిగిందని భావించినా, సేవల్లో లోపం ఉందని, నిర్ధారిత ధర కంటే ఎక్కువ వసూలు చేసినా, అపాయకరమైన వస్తువులు, సేవలు అమ్మకానికి పెట్టినా కేసు నమోదు చేయవచ్చు.

వెంటాడుతున్న అవగాహన లేమి

వినియోగదారుల హక్కులు, చట్టం తదితర అంశాలపై అవగాహనా లేమి వెంటాడుతోంది. మా పరిధిలో గడిచిన మూడేళ్లలో 255 కేసులు నమోదు కాగా అందులో 250 కేసులు పరిష్కరించారు. వస్తువుల కొనుగోలు, బీమా చెల్లింపు తదితర అంశాలను పూర్తిగా చదువుకోవాలి.

–ఎ.వెంకటరమణ, సభ్యుడు, కన్స్యూమర్‌ ఫోరం–2, ఎన్టీఆర్‌ జిల్లా

చర్యలు తీసుకునేవారే లేరు

మార్కెట్లో చేపల తూకంలో మోసాలు బహిరంగంగా జరుగుతున్నా దీనిపై చర్యలు తీసుకునేవారు లేరు. చేపల మార్కెట్లలో కవర్లలో, ట్రేలలో నీళ్లతోపాటు చేపలను తూకం వేసి అమ్ముతున్నారు. చేపల ధరలు కూడా మార్కెట్‌లో ధరల పట్టిక ఉండదు. పట్టిక గురించి ప్రశ్నిస్తే ఎవరూ సమాధానం చెప్పరు. ప్రభుత్వం దృష్టి సారించాలి.

–నాగార్జున, వినియోగదారుడు

No comments yet. Be the first to comment!
Add a comment
ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు 1
1/5

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు 2
2/5

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు 3
3/5

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు 4
4/5

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు 5
5/5

ఈ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement