గవర్నర్‌ను కలిసిన కృష్ణా వర్సిటీ ఉపకులపతి రాంజీ
కోనేరుసెంటర్: రాష్ట్ర గవర్నర్, కృష్ణా విశ్వ విద్యాలయం చాన్సలర్ అబ్దుల్ నజీర్‌ను ఉపకులపతి ఆచార్య కె.రాంజీ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సదరు అంశాలకు సంబంధించిన పనులు చేపట్టడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. అనంతరం అబ్దుల్ నజీర్‌కు వీసీ శాలువా కప్పి సత్కరించి మొక్కను బహూకరించారు.
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు శనివారం నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు శుక్రవారం తెలిపారు. జెడ్పీ సమావేశ హాల్లో ఉదయం 10 గంటలకు గ్రామీణాభివృద్ధి, 12 గంటలకు విద్య, వైద్య స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరుగుతాయన్నారు. 11 గంటలకు వైస్‌చైర్మన్ గరికిపాటి శ్రీదేవి అధ్యక్షతన వ్యవసాయ స్థాయీ సంఘ సమావేశం, మధ్యాహ్నం ఒంటి గంటకు ఉంగుటూరు జెడ్పీటీసీ సభ్యురాలు దుట్టా సీతారామలక్ష్మి అధ్యక్షతన సీ్త్ర, శిశు సంక్షేమం, 2 గంటలకు వైస్‌చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు అధ్యక్షతన సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన పనులు, ఆర్థిక సమావేశాలు నిర్వహిస్తారని సీఈవో తెలిపారు. ఉమ్మడి జిల్లా అధికారులు శాఖాపరంగా పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆయన కోరారు.
కనులపండువగావేణుగోపాలుని తిరుకల్యాణం
తిరువూరు: నెమలి శ్రీవేణుగోపాలస్వామి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. పెళ్లి కుమారుడైన వేణుగోపాలుడిని సంప్రదాయబద్ధంగా గరుడ వాహనంపై ఉంచి మేళతాళాలతో ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపైకి తోడ్కొని వచ్చారు. పెళ్లి కుమార్తైలెన శ్రీదేవి, సత్యభామలను పల్లకీలో తీసుకువచ్చారు. వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని చూసి తరించేందుకు వచ్చిన భక్తులతో శుక్రవారం ఉదయం నుంచి ఆలయం కిటకిటలాడింది. కల్యాణోత్సవం అనంతరం గరుడవాహనంపై స్వామివారిని, దేవేరులను ఆలయ ప్రవేశం చేయించారు. భక్తుల కోలాట నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. విజయవాడ ఎంపీ చిన్ని దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. 260 మంది దంపతులు పీటలపై కూర్చున్నారు. తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగానాంచారమ్మ జాతర
పెదప్రోలు(మోపిదేవి): మండలంలోని పెదప్రోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీఅద్దంకి నాంచారమ్మవారి ఆలయ వార్షిక జాతర మహోత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రాత్రి గుడి సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నమాచార్య కీర్తనలు, కూచిపూడి–భరతనాట్యం, భక్త చింతామణి, బాల నాగమ్మ నాటకం, సినీగాయని శ్రావణ భార్గవి, రవి మెలోడిస్ ఆర్కెస్ట్రా, అఘోరా వేషాలు, తీన్‌మార్ వాయిద్యాలు, మిమిక్రీ షో, మ్యాజిక్ షో, మురళీ కోలాటాలు నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొ న్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల వెంకట్రామ్మయ్య, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గురుప్రసాద్, ఆలయ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గవర్నర్‌ను కలిసిన కృష్ణా వర్సిటీ ఉపకులపతి రాంజీ
Comments
Please login to add a commentAdd a comment