వైభవంగా తిరుపతమ్మ చిన్నతిరునాళ్ల
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్ల పౌర్ణమి శుక్రవారం ఉదయం 6.02 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాసంప్రోక్షణ అనంతరం ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్‌కుమార్, చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో తిరునాళ్ల మొదలయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు మర్రె బోయిన గోపిబాబు, అర్చకులు పాపమాంబ వంశీకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జ్యోతి వెలిగించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, ఆలయ ఈఈ రమ, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఉమాపతి, ఏఈ రాజు, తదితరులు పాల్గొన్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులు మునేరులో స్నానాలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తుల కోసం దేవస్థానం వద్ద తాత్కాలికంగా పోలీస్ ఔట్‌పోస్టు, హెల్త్ క్యాంప్‌లు, పలు శాఖలకు చెందిన కార్యాలయాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీప కాంతులతో ఆలయం మెరిసిపోతోంది. నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యాన జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తుల సందడి
చిన్న తిరునాళ్లలో మొదటి రోజు పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మ వారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మునేరులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేశఖండనశాలలో భక్తులు తలనీలాలు తీయించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మునేరులో నీరు లేక పోవడంతో ఆలయ అధికారులు తాత్కాలికంగా జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు.
వైభవంగా తిరుపతమ్మ చిన్నతిరునాళ్ల
Comments
Please login to add a commentAdd a comment