గురుకులం వద్ద ఉద్రిక్తత
ఐఐటీ–మెడికల్ అకాడమీ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్థాంతరంగా అకాడమీని తరలించడంతో తమ చదువులు ప్రశ్నార్థకం అవుతాయని, వసతులు లేక ఇబ్బందులు పడే అవకాశం ఉందంటూ నినాదాలు చేశారు. రెండో సంవత్సరం విద్య పూర్తయ్యే వరకూ మెడికల్ అకాడమీని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న ఉమ్మడి కృష్ణాజిల్లా కోఆర్డినేటర్ ఎ.మురళీకృష్ణ, అకాడమీ డైరెక్టర్ బ్యూలాతో కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. కుంటముక్కల, ఇతర గురుకులాల్లో మెరుగైన విద్య అందేలా, అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఫ్యాకల్టీని కూడా పూర్తి స్థాయిలో కుంటముక్కలలో అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. అయితే అద్దె భారం అనుకోకుండా అకాడమీని కొనసాగించి తమ చదువులు, భద్రతకు భరోసా ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ విషయమై మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్తామని వివరించారు. ఇదే సమయంలో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అకాడమీకి చేరుకుని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.సమరం నేతృత్వంలో అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment