వాలీబాల్ డెప్యూటీ చీఫ్ రిఫరీగా డానియేల్
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్‌షాపునకు చెందిన అంతర్జాతీయ వాలీబాల్ రిఫరీ ఎం.డానియేల్ నేషనల్ డెప్యూటీ చీఫ్ రిఫరీగా ఎంపికయ్యారు. న్యూఢిల్లీకి చెందిన రైల్వే ప్రమోషన్ బోర్డు సభ్యులు తనను డెప్యూటీ చీఫ్ రిఫరీగా ఎంపిక చేసిన ఉత్తర్వులను శుక్రవారం ఆయన అందుకున్నారు. రైల్వే స్పోర్ట్స్ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక వాలీబాల్ మ్యాచ్‌లకు రిఫరీగా ఆయన సేవలు అందించినందుకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా వ్యాగన్ వర్క్‌షాపు చీఫ్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, డెప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ ఎ.చంద్రశేఖర్, స్పోర్ట్స్ అధికారి హనుమనాయక్, పర్సనల్ అధికారి శైలా సుధాకర్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రహ్మాజీ, కార్యదర్శి దయాకర్ తదితరులు డానియేల్‌ను ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment