అనుమానాస్పద స్థితిలో విద్యుత్ కార్మికుడు మృతి
ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్టీటీపీఎస్ చన్నీటి కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటుపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌లో స్విచ్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు మణికుమార్ బుధవారం నుంచి కనిపించడంలేదు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఎన్టీటీపీఎస్ కాలువలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన సంస్థ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మణికుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment