ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడి అరెస్టు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఎస్‌ఎన్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నాలుగు వాహనాలను సీజ్ చేశారు. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు.. సత్యనారాయణపురంలోని పలు ప్రాంతాలలో వరుసగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. ఈ చోరీలపై బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీ అధారంగా చోరీలకు పాల్పడింది వించిపేటకు చెందిన గేదెల యోసోబు అలియాస్ జాన్‌బాబుగా గుర్తించారు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి చోరీ చేసిన నాలుగు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment