విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహరి
(ఆది) (సోమ)
విజయవాడ 6.23 4.56
మచిలీపట్నం 6.22 4.55
కంకిపాడు: పసుపును బంగారంతో పోలుస్తారు. పసిడి ధర మాత్రం ఆకాశాన్నంటుతుంటే పచ్చబంగారం మాత్రం నేలచూపులు చూస్తోంది. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధర లేక ఆరుగాలం శ్రమించి పంటను కాపాడుకున్న రైతు ఆందోళన చెందుతున్నాడు. నాణ్యమైన దిగుబడులకు మంచి ధర వస్తుందనే ఆశతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. పచ్చబంగారంగా పిలిచే పసుపు పంట ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటి. ఈ ఏడాది కృష్ణా జిల్లా వ్యాప్తంగా 5,031 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలోని 707 ఎకరాల్లో పసుపు సాగు జరిగింది. కడప, మైదుకూరు, ప్రగతి, శీలం, స్థానిక విత్తన రకాలను రైతులు సాగుకు ఎంపిక చేసుకున్నారు. పంట కాలం పూర్తికావడంతో గడిచిన 20 రోజులుగా రైతులు పసుపు ఆకుతీత, దుంప తవ్వకం పనులను చేపడుతున్నారు.
ఖర్చు అధికం
ఈ ఏడాది పసుపు సాగు ఖర్చులు భారీగా పెరిగాయి. ఎకరాకు ఆరు పుట్టు పసుపు విత్తనం కొనుగోలు చేసి సాగు చేసుకున్నారు. గతంలో రూ. 3,500 నుంచి రూ.4 వేలకు విత్తనం పసుపు కొమ్ములు లభించేవి. విత్తనం కొమ్ములు లభ్యత లేకపోవడంతో డిమాండ్ పెరిగింది. ఆరు పుట్టు విత్తనం కొనుగోలుకే రూ.60 వేల నుంచి రూ.65 వేలు వరకూ పెట్టుబడులు పెట్టారు. కౌలు ఒప్పందం రూ. 35 వేల నుంచి రూ.40 వేలు ఉంది. పంట సాగు, యాజమాన్యానికి మరో రూ.60 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. పంట కాలంలో కురిసిన భారీ వర్షాలు, ఏటిపాయ వెంట సాగు చేపట్టిన పసుపు పొలాలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి తోడు వర్షాలకు పసుపు చేలల్లో నీరు నిలిచి దుంప కుళ్లు ఆశించింది. దీంతో పంట సంరక్షణ చర్యలకు రైతులు నానా పాట్లు పడ్డారు. ప్రస్తుతం ఆకుతీత, దుంప తవ్వకం పనులు చేపట్టేనాటికి రూ.1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు.
దిగుబడులు ఆశాజనకమే
భారీ వర్షాలు, తెగుళ్ల సమస్యతో దిగుబడులు తగ్గుతాయని రైతులు భావించారు. దుంప కుళ్లు ఆశించిన ప్రాంతాల్లో మినహా దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఎకరాకు పచ్చి కొమ్ములు 65నుంచి70 పుట్టు (పుట్టు 225 కిలోలు) వస్తుందంటున్నారు. వంట పూర్తి చేసి, ఎండబెట్టిన తర్వాత ఎకరాకు సుమారుగా 20 నుంచి 26 క్వింటాళ్ల వరకూ దిగుబడి చేతికందే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.
ధర రోజు రోజుకీ తగ్గుముఖం
పసుపు పంట ధర చూసి రైతులు నీరసించిపోతున్నారు. మార్కెట్‌లో రోజు రోజుకీ ధర తగ్గుముఖం పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో క్వింటా పసుపు కొమ్ముల ధర రూ.14,500 నుంచి రూ. 15,000 పలికింది. క్రమంగా రేటు తగ్గుతూ వచ్చింది. సిండికేట్ మాయాజాలం కారణంగా చాలా రోజులు క్వింటా ధర రూ.12 వేలు దాటని దుస్థితి. ప్రస్తుతం పంట చేతికొస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు మార్కెట్‌లో గంపెడాశతో ఉన్నారు. క్వింటా రూ.13 వేలు చేరుతుందని ఆశించారు. అయితే మార్కెట్‌లో మాత్రం రూ.9500–రూ.9800 లోపు పలుకు తోంది. నాణ్యమైన పంట దిగుబడులు ఉన్నాయని, మార్కెట్‌లో మంచి ధర లభిస్తే పెట్టుబడులు పూర్తిగా చేతికొచ్చి సాగు లాభదాయకంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. వంట పనులు చేసేనాటికి ధర ఆశాజనకంగా ఉండొచ్చని ఆశలు భావిస్తున్నారు.
7
న్యూస్‌రీల్
జిల్లాలో మొదలైన పసుపు దుంప తవ్వకాలు దిగుబడులు ఆశాజనకం మార్కెట్‌లో తగ్గుతున్న ధర రేటు పెరుగుతుందనే ఆశతో రైతులు
ప్రశ్నపత్రానికి క్యూఆర్ కోడ్
ఈ ఏడాది సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రశ్నపత్రానికి ఒక క్యూఆర్ కోడ్‌ను ఇవ్వడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు చోటు ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారు. నో మొబైల్ జోన్‌గా పరీక్ష కేంద్రాలను, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు.
ఎంతో ఆశతో ఉన్నాం
రెండెకరాల్లో పసుపు పంట సాగు చేశాను. విత్తనం ధర భారీగా పెరగడంతో పెట్టుబడులు కూడా రూ.1.60 లక్షలు ఎకరానికి అయ్యాయి. వంట పూర్తై, ఎండ బెట్టిన కొమ్ములు మార్కెట్‌కు వచ్చే నాటికి మరో రూ.50 వేలు దాటుతుంది. ధర క్వింటా రూ.9600 అంటున్నారు. దిగుబడి నాణ్యంగా ఉంది. ధర కూడా పెరుగుతుందనే ఆశతో ఉన్నాం.
– దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి,
రైతు, చలివేంద్రపాలెం
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
Comments
Please login to add a commentAdd a comment