ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయిలో కార్యక్రమం చేసేటప్పుడు ప్రజాప్రతినిధులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ హాల్లో శనివారం స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. తొలుత స్వచ్ఛాంధ్రలో భాగంగా సభ్యులు, అధికారులతో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జరిగిన గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘ సమావేశంలో ఉపాధి కల్పన అధికారి విక్టర్‌బాబు నిరుద్యోగులకు జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. జాబ్‌మేళాలపై తమకు సమాచారమిస్తే గ్రామాల్లో తెలియజేస్తామని, చెప్పకుండా నిర్వహిస్తే ఎలా అని జెడ్పీటీసీ సభ్యులు వాపోయారు. దీనిపై చైర్‌పర్సన్ స్పందిస్తూ జాబ్‌మేళా నిర్వహించేటప్పుడు మైక్ ఎనౌన్స్‌మెంట్, టాంటాం ద్వారా తెలియజేయాలన్నారు. ఎంపీడీవోలకు కూడా సమాచారమివ్వాలన్నారు.
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడండి
విద్య, వైద్య స్థాయి సంఘ సమావేశంలో చైర్‌పర్సన్ హారిక మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి జరగనున్న ‘పది’ పరీక్షల్లో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. స్ఫూర్తి మెటీరియల్, పౌష్టికాహారంతో విద్యార్థులు బాగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలని అప్పుడే తాము కేటాయించిన నిధులకు సార్ధకత చేకూరుతుందన్నారు. వైస్‌చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు మాట్లాడుతూ నూజివీడు మండలంలో మూగ, చెవుడు, అంగవైకల్యం కలిగిన విద్యార్థులు సుమారు 50 మంది వరకు ఉన్నారని వీరికి ప్రత్యేక ఉపాధ్యాయులను కేటాయింలన్నారు. చైర్‌పర్సన్ స్పందిస్తూ రాబోయే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసి సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉండేలా సర్దుబాటు చేయాలన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపడానికి సమ్మర్‌లో క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు.
నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోండి
కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయని అందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారని చైర్‌పర్సన్ అడిగారు. పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి చిన నరసింహులు మాట్లాడుతూ బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకిన ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. కొన్నిప్రాంతాల్లో బొబ్బలు వచ్చి దూడలు చనిపోతున్నాయని పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించి కాపాడాలని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. పీఎం సూర్యఘర్ ద్వారా సౌర ఫలకాల ఏర్పాటుకు అవగాహన కల్పించాలన్నారు. మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత కార్మికులకు ష్యూరిటీ లేకుండా ముద్ర రుణాలు అందేలా బ్యాంకు అధికారులతో మాట్లాడాలన్నారు. గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు వేముల సురేష్ మాట్లాడుతూ గూడూరు సీహెచ్‌సీలో గతంలో ఓపీ 200 పైగా ఉండేదని ప్రస్తుతం 50 మంది కూడా రావడం లేదన్నారు. ఎక్స్‌రే తీయడానికి సీఆర్ మిషన్ లేక వినియోగంలో లేదని దాన్ని వాడుకలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం సీ్త్ర, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనులు, ఆర్థిక స్థాయీ సంఘ సమావేశాల్లో పలు అంశాలను సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనందకుమార్, జెడ్పీటీసీ సభ్యులు ఊట్ల నాగమణి, కూనపరెడ్డి స్వరూపరాణి, భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, సీహెచ్ అనూష, సువర్ణరాజు పాల్గొన్నారు.
బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్చేందుకు సమ్మర్‌లో క్యాంపెయిన్ నిర్వహించాలి చేనేత కార్మికులకు రుణాలపై బ్యాంకర్లతో మాట్లాడండి స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక
Comments
Please login to add a commentAdd a comment