సౌకర్యాల ఏర్పాటుకు ప్రాధాన్యం
పెనుగంచిప్రోలు: అమ్మవారి భక్తులకు సదుపాయాలు కల్పించడానికి ఆలయ అధికారులు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ సూచించారు. పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ ఆలయ అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రూ.4.75కోట్లతో నిర్మించిన కేశఖండనశాల, టాయిలెట్ బ్లాక్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన చిన్నం యాగయ్య జ్ఞాపకార్థం ఆయన సతీమణి కృష్ణవేణి కుటుంబ సభ్యులు రూ.కోటితో నిర్మించిన డార్మెటరీని ఆదివారం ఆయన ప్రారంభించారు. మున్నేరు పక్కన కరకట్ట నిర్మాణానికి సంబంధించి ఆలయ అధికారులు, గ్రామపెద్దలతో సమీక్షించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. డార్మెటరీని నిర్మించిన దాతలు కృష్ణవేణి కుటుంబసభ్యులను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. కార్యక్రమంలో చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఆలయ ఈవో కిషోర్‌కుమార్, సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, ఈఈ ఎల్.రమ, ఏఈవో ఉమాపతి, ఏఈ రాజు, నాయకులు చింతల సీతారామయ్య, కొత్తపల్లి సతీష్, ఆలయ మాజీ చైర్మన్లు కాకాని శ్రీనివాసరావు, కర్ల వెంకటనారాయణ, కల్లూరి శ్రీవాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment