వైభవంగా నృసింహుని పుష్పయాగోత్సవం
మంగళగిరి: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం పుష్పయాగోత్సవం వైభవంగా నిర్వహించారు. 11 రోజుల నుంచి జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి వివిధ రకాల పుష్పాలతో యాగోత్సవం చేశారు. ఆలయ ఆస్థాన మండపంలో జరిగిన ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని పుష్ప సేవ చేశారు. ఉత్సవానికి కై ంకర్యపరులుగా నందం సాంబశివరావు, శాంతికుమారి వ్యవహరించగా ఆలయ ఈవో ఎ.రామకోటిరెడ్డి పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment