తిప్పలు పడుతున్నాం
గ్రామంలో తాగునీరు వారానికి ఒకసారి వస్తుంది. అరకొరగానే కుళాయిల నుంచి వస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రధాన పైపుల ద్వారా తాగునీరు సరఫరా కావట్లేదు. అధికారులు ట్రాక్టర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం లేదు. దీంతో తిప్పలు పడుతున్నాం. మేజర్ గ్రామమైనా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. –కంచర్ల పద్మావతి, బీసీ కాలనీ, పరిటాల
తాగునీటిని కొనుగోలు చేస్తున్నాం
కాలనీకి వారానికి ఒకసారి కూడా తాగునీరు రావడం లేదు. మినరల్ వాటర్ ప్లాంట్‌ల వద్దకు వెళ్లి తాగునీటిని కొనుగోలు చేసి దాహార్తిని తీర్చుకుంటున్నాం. నీటి సరఫరాపై అనేకసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకునేవారే లేరు.
–బొక్కా కుమారి, అరుంధతీ నగర్, కంచికచర్ల
●
తిప్పలు పడుతున్నాం
Comments
Please login to add a commentAdd a comment