పొట్టి శ్రీరాములుకు నివాళి
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. శ్రీరాములు చిత్రపటానికి సీపీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు విశేషంగా కృషి చేశారని, మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాల్లో పయనించారన్నారు. మద్రాసు రాజధానిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో తెలుగువారి కష్టాలకు చలించి భాష ప్రయుక్త రాష్ట్రం కావాలని ఉద్యమించి అమరులయ్యారని తెలిపారు.
సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తే సహించబోం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే వారిని సహించేది లేదని రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి అన్నారు. అలా వ్యవహరించేవారిని సంఘం పదవుల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో విశ్వబ్రహ్మణ సంఘం సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. కొందరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. మాతృ సంఘాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని వివరించారు. అటువంటి వారందరినీ రాష్ట్ర సంఘ కార్యకలాపాల్లో పాల్గొనకుండా బహిష్కరిస్తున్నామన్నారు. సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చేవూరు రామస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఫిరంగి చంద్రశేఖర్, గౌరవ సలహాదారులు సూర్యనారాయణ, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా బి.నీరజ, రాష్ట్ర మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీదేవి, గురజాడ రాజేశ్వరి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విజయలక్ష్మి, లత, వరలక్ష్మిని ఎన్నుకున్నామని ఆయన తెలిపారు.
పొట్టి శ్రీరాములుకు నివాళి
Comments
Please login to add a commentAdd a comment