దుర్గమ్మ సన్నిధిలో ప్రముఖులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో నితిన్, రాబిన్ హుడ్ దర్శకుడు వెంకి, నిర్మాత రవిశంకర్‌లతో పాటు సంగీత దర్శకుడు తమన్ వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. హీరో నితిన్ తన నూతన చిత్రం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నానని పేర్కొన్నారు.
● దుర్గమ్మను రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, హడ్కో అధికార బృంద సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి నారాయణ, హడ్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సంజయ్ కులశ్రేష్ఠ, కార్పొరేట్ ప్లానింగ్ డైరెక్టర్ ఎం.నాగరాజు, ఫైనాన్స్ డైరెక్టర్ దిల్జిత్‌సింగ్ కఠారి, ఏపీ రీజనల్ చీఫ్ బి.ఎన్.ఎ.మూర్తి, ఎస్.ఎం.శ్రీనివాస్, టి.సుబ్బారావుతో కూడిన బృందానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
దుర్గమ్మ సన్నిధిలో ప్రముఖులు
Comments
Please login to add a commentAdd a comment