మర్యాదపూర్వక కలయిక
కోనేరుసెంటర్: కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ ఆదివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అమరావతిలో కేంద్ర మంత్రిని కలిసిన ఆయన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కృష్ణా విశ్వవిద్యాలయంలో అంతర్గత రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు. తొలుత కేంద్ర మంత్రి పెమ్మసానిని వీసీ శాలువా కప్పి సత్కరించి మొక్కను బహూకరించారు.
మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్‌లో మదర్స్ మిల్క్ బ్యాంకు ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మిల్క్ బ్యాంకును ఆదివారం సినీ హీరో మహేష్‌బాబు సతీమణి నమ్రత లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నమ్రత మీడియాతో మాట్లాడుతూ.. నవజాత శిశువుల కోసం మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గుండె జబ్బులున్న చిన్నారులకు సేవా భావంతో సర్జరీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు మాట్లాడుతూ.. మదర్స్ మిల్క్ బ్యాంకు ద్వారా ఏటా సుమారు 7200 మంది నవజాత శిశువులు లబ్ధిపొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ పి.వి.రమణమూర్తి, ఫీటల్ స్పెషలిస్టు డాక్టర్ పద్మ, రోటరీ ప్రతినిధి డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య పాల్గొన్నారు.
మర్యాదపూర్వక కలయిక
Comments
Please login to add a commentAdd a comment