శోభాయమానం.. దివ్య ప్రభోత్సవం
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్లలో మూడో రోజు ఆదివారం రాత్రి 90 అడుగుల దివ్య ప్రభోత్సవం కమనీయంగా జరిగింది. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తయిన ప్రభగా గుర్తింపు పొందిన ఈ దివ్య ప్రభోత్సవం 1928 నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముందుగా అమ్మవారికి రజకులు, శాలివాహనులు కుంభం పోసి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆలయ ఈవో బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్‌కుమార్, చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఆలయ ఈఈ ఎల్ రమ ఆధ్వర్యంలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అలంకరించిన ఇనుప ప్రభపై ఉత్సవ విగ్రహాలను ఉంచి దేవస్థానం వారు గ్రామానికి చెందిన రైతుల ఎడ్లను కట్టి రథాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ప్రభ ముందు డప్పు వాయిద్యాలు, కొమ్ము వాయిద్యాలు, నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సీఐ పి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎస్‌ఐ అర్జున్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె. బాలకృష్ణ, ఆలయ ఏఈఓలు ఉమాపతి, తిరుమలేశ్వరరావు, ఏఈ రాజు ఆలయ పాలకరవ్గ సభ్యులు, గ్రామపెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మూడో రోజు కొనసాగిన
తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల
శోభాయమానం.. దివ్య ప్రభోత్సవం
Comments
Please login to add a commentAdd a comment