ఎకై ్సజ్.. ఎక్సర్‌సైజ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజకవర్గంలో నాటుసారా నిర్మూలన కోసం సాక్షి దిన పత్రిక చేపట్టిన యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది. వరుస కథనాలతో ప్రభుత్వ యంత్రాంగంలో కొంత కదలిక వచ్చింది. ఎకై ్సజ్‌శాఖ రాష్ట్ర అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా తిరువూరు ఎకై ్సజ్ పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులకు సూచనలు చేశారు. దీంతో స్థానిక ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
మూలాలపై దృష్టి..
సారా నిర్మూలనలో భాగంగా ఇప్పటి వరకు తయారీ, విక్రయాలు చేస్తున్న వ్యక్తులపై మాత్రమే ఎకై ్సజ్‌శాఖ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, పటిక, పాత్రలు, డ్రమ్ములు, చెక్కలు విక్రయించే వ్యక్తులతో పాటు ఆర్థికంగా అండగా ఉంటున్న వ్యక్తులు, సపోర్టుగా ఉంటున్న పెద్ద మనుషులపై అధికారులు దృష్టి పెడుతున్నారు. నాటుసారా తయారీకి సహకరించే వ్యక్తులపైనా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మేడూరులో నాటుసారా తయారీకి బెల్లం విక్రయిస్తున్న అద్దగిరి వేణుబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని నుంచి 71కేజీల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు.
కలెక్టర్ సైతం..
సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘నవోదయం’ కార్యక్రమంలో భాగంగా తిరువూరు శ్రీ వాహిని ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 18న నాటుసారా నిర్మూలనపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నసారా నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలు, మండల కమిటీలు, ఎకై ్సజ్‌శాఖ అధికారులతో సమీక్ష జరపనున్నారు.
సారాపై ‘సాక్షి’ కథనాలతో కదిలిన యంత్రాంగం
తిరువూరు చేరిన రాష్ట్ర
ఎకై ్సజ్‌శాఖ ఉన్నతాధికారులు
మూలాలను వెతికే పనిలో నిమగ్నం
నిందితులపై పీడీ చట్టాన్ని
ప్రయోగించాలని ఆదేశాలు
రేపు జిల్లా కలెక్టర్ తిరువూరులో
సమావేశం
Comments
Please login to add a commentAdd a comment