నిర్మూలనపై సమీక్ష..
నాటుసారా నిర్మూలనపై సాక్షి ప్రచురించిన వరుస కథనాలతో ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ స్పందించారు. తిరువూరు ఎకై ్సజ్‌శాఖ పోలీసుస్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, నిందితుల వివరాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి ఎస్. శ్రీనివాసరావు, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుబాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రాంశివ, తిరువూరు ఎకై ్సజ్ సీఐ జె. శ్రీనివాస్‌తో సమీక్ష జరిపారు. నాటుసారా నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించినట్లు సమాచారం. పదేపదే పోలీసులకు చిక్కుతున్న నిందితులపై పీడీ యాక్టును ప్రయోగించాలని సూచించినట్లు తెలిసింది. ఈ యాక్టులో కేసు నమోదై రుజువైతే ఒకటి నుంచి రెండు సంవత్సరాలపాటు నిందితులు జైలుపాలవుతారు.
Comments
Please login to add a commentAdd a comment