ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ | - | Sakshi
Sakshi News home page

ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ

Published Tue, Mar 18 2025 10:00 PM | Last Updated on Tue, Mar 18 2025 10:01 PM

ఆర్భా

ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా..

ఇబ్రహీంపట్నం మండలం, పరిసర ప్రాంతాలకు చెందిన దివ్యాంగులం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా అభ్యర్థన మేరకు 35 ఏళ్ల క్రితం ఇబ్రహీంప ట్నంలో ఆర్‌ఎస్‌ నంబర్‌ 230/1లో చెరువుగా ఉన్న భూమిలో పది సెంట్లు కేటాయిం చడంతో దాతల సాయంతో రేకుల షెడ్డు నిర్మించి సంఘ కార్యకలాపాలు సాగిస్తున్నాం. విజయవాడకు చెందిన రైల్వే ఉద్యోగి, అంధుడు జి.ఎస్‌.కె.స్వామి తమను కలసి, అందరం కలసి కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, దానిని అభివృద్ధి చేసుకుందామని నమ్మబలికి, మా వద్ద నుంచి భారీగా చందాలు వసూలు చేశాడు. కొంత కాలం గడిచాక ఓ రోజు అర్ధరాత్రి కొంత మంది వ్యక్తులతో రేకుల షెడ్డును తొలగించి ఆ స్థలాన్ని ఆక్రమించాడు. దీనిపై సంఘ సభ్యులం స్థానిక పోలీస్‌ స్టేషన్‌, మండల కార్యాలయం, కలెక్టర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటు వంటి స్పందన లేదు.

– పెండెం గాంధీ, దివ్యాంగుడు

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) అమలు తీరు ప్రచార ఆర్భాటం ఎక్కువ.. సమస్యల పరిష్కారం తక్కువ.. అన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సమస్యలపై ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా అర్జీలు వస్తున్నాయి. వాటిలో కొన్నింటికి మాత్రమే పరిష్కారం లభిస్తోంది. మేజర్‌ సమస్యల అర్జీలు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొందరు మండల స్థాయి అధికారులు అర్జీదారులను పిలిపించు కుని, వారి సంతకం తీసుకుని ఆ అర్జీ పరిష్కారమయినట్లు ఆన్‌లైన్‌లో చూపుతున్నారు. దీంతో అర్జీదారులు సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సమస్య పరిష్కారం కాలేదంటూ అధికారులు రీ ఓపెన్‌ చేస్తు న్నారు. అయితే అవి పరిష్కారానికి నోచకుండానే ఆన్‌లైన్‌ నుంచి మాయమైపోతున్నాయి.

డ్యాష్‌ బోర్డు లెక్కలు తప్పుల తడక

కూటమి ప్రభుత్వం గతేడాది జూన్‌ 15న పీజీ ఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి సోమవారం గ్రామం, మండలం, డివిజన్‌, జిల్లా కేంద్రం (కలెక్టరేట్‌) స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కలెక్టరేట్‌లో అందే అర్జీల్లో అత్య ధికంగా రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఉంటున్నాయి. రెండో స్థానంలో పోలీసు కేసులకు సంబంధించి ఉంటున్నాయి. ఆ తర్వాత పెన్షన్లు, ఇతర సమస్యలపై అర్జీలు ఉంటున్నాయి. వీటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని నిర్ణయించారు. పది నెలల కాలంలో వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో 2,770 అర్జీలు అందజేశారు. వాటిలో 281 ప్రగతిలో ఉన్నాయి. మిగిలిన 2,419 అర్జీలు పరిష్కారమైనట్లు డ్యాష్‌ బోర్డు లెక్కలు చెబుతున్నాయి. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొందరు తమ సమస్యలు పరిష్కారం కాలేదంటూ కలెక్టరేట్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు సమర్పిస్తున్నారు. ఇక కొత్త పెన్షన్ల కోసం పీజీఆర్‌ఎస్‌లో అర్జీ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వాటికి అతీగతీ లేదు. ఇక రెవెన్యూ సమస్యలైతే కింది స్థాయి అధికారుల దయ.. తమ ప్రాప్తం అన్నట్లు ఉంది.

చందర్లపాడు మండలం ఏటూరి గ్రామంలో 2023 జూన్‌లో నాయని సుధాకర్‌ వద్ద ఎకరం రెండు సెంట్ల పొలం కొనుగోలు చేశాను. పట్టాదారు పాసుపుస్తకాలు అన్ని నా పేర వచ్చాయి. పొలంలో సుబాబుల్‌ వేశాను. ఈ పంట కూడా నా పేర నమోదైంది. ఏటూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఉన్నం నరసింహారావు అండతో కొందరు నకిలీ దస్తావేజులు సృష్టించి భూమి కాజేయాలని చూస్తున్నారు. కరణం సీతామహాలక్ష్మి, కరణం గంగయ్య, ఉన్నం నరసింహారావు, నలజాల నాగేశ్వరరావు, మణ్యం వెంకటరావు, ఉప్పుటూరి వెంకటరావు పొలంలో పనిచేస్తున్న నాపై దాడికి ప్రయత్నించారు. ఇతర వ్యక్తులను పంపి బెదిరించారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోని పోలీసులు నన్ను పొలం అమ్మేయాలని బెదిరిస్తున్నారు. సీఐ అర్జీ రాసి దానిపై సంతకం చేయాలని బెదిరించారు. నా కొడుకుపై రేప్‌ కేసు పెడతామని బెదిరించారు.

– కొప్పురావూరి సూర్యలక్ష్మి, చింతలపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా

అర్జీదారులకు భరోసా ఇవ్వని పీజీఆర్‌ఎస్‌

కాళ్లు అరిగేలా తిరుగుతున్న అర్జీదారులు

క్షేత్రస్థాయిలో స్పందనలేక రీ ఓపెన్‌ అవుతున్న అర్జీలు

డ్యాష్‌బోర్డు లెక్కలకు, వాస్తవ పరిస్థితికి కుదరని పొంతన

టీడీపీ నాయకుడు భూమి కాజేయాలని చూస్తున్నాడు

విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 133 అర్జీలు అందాయి. ఈ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు. డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్‌ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 133 అర్జీలు

నా పేరు కొమ్మినేని కృష్ణారావు. మాది తిరువూరు మండలం రాజు గూడెం. కో ఆపరేటివ్‌ సొసైటీలో రూ.25 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాను. 2006లో అప్పటి ప్రభుత్వం రుణమాఫీ చేసింది. రుణ మాఫీ విషయాన్ని తొక్కిపెట్టి అధిక వడ్డీ వేసి రూ.50 వేలు వసూలు చేశారు. మా కుటుంబ సభ్యుల నుంచీ అలాగే వసూలు చేశారు. ఒరిజినల్‌ దస్తావేజులు తిరిగి ఇవ్వలేదు. అదేమని అడిగితే డాక్యుమెంట్లు పోయాయని చెబుతున్నారు. తప్పుడు లెక్కల తాలూకు వివరాలతో ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌లో అర్జీ పెడుతున్నా. నా సమస్యను పరిష్కరించాలని సహకార శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ 1
1/4

ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ

ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ 2
2/4

ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ

ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ 3
3/4

ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ

ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ 4
4/4

ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement