బాల్ బ్యాడ్మింటన్ విజేత సిద్ధార్థ మహిళా కాలేజీ
విజయవాడస్పోర్ట్స్: కృష్ణా యూనివర్సిటీ అంతర కళాశాలల బాల్ బ్యాడ్మింటన్ మహిళల పోటీల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కాలేజీ జట్టు సత్తా చాటింది. విజయవాడలోని సిద్ధార్థ మహిళా కాలేజీ క్రీడా ప్రాంగణంలో సోమవారం జరిగిన పోటీల్లో గెలుపొంది విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. ఈ పోటీల్లో వైవీఎన్‌ఆర్ అండ్ జేడీ కాలేజీ (కై కలూరు) ద్వితీయ స్థానం, శ్రీపద్మావతి హిందు డిగ్రీ మహిళా కాలేజీ (మచిలీపట్నం) మూడో స్థానం, డాక్టర్ ఎల్‌హెచ్‌ఆర్ అండ్ జీడీ కాలేజీ (మైలవరం) నాలుగో స్థానం సాధించాయి. విజేతలకు సిద్ధార్థ మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కల్పన, కన్వీనర్ శ్రీ లలిత్‌ప్రసాద్, స్పెషన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.మాధవి, ఫిజకల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.హేమ బహుమతులు అందజేశారు. ఈ నెల 29 నుంచి చెన్నయ్ అలగప్ప యూనివర్సిటీలో జరిగే జాతీయ అంతర విశ్వవిద్యాలయాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే కృష్ణా వర్సిటీ జట్టులో తమ విద్యార్థినులు ఎం.ఉమామహేశ్వరి, పి.భువనేశ్వరి, కె.సరస్వతి, ఎ.శ్రీరాజిని చోటు దక్కించుకున్నారని ప్రిన్సిపాల్ కల్పన ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment