మా భూమి నుంచి 11 సెంట్లు కబ్జా
నా భార్య పేరిట సర్వే నంబర్ 7–1డీలో 52 సెంట్లు, 8–1సీలో 15 సెంట్ల భూమి ఉంది. ఈ 67 సెంట్ల రిజిస్టర్ పట్టా భూమి నుంచి 15 ఏళ్లుగా పక్క పొలంవారు 11 సెంట్లు అక్రమించుకున్నారు. అందు లోని సుబాబులు పంటను వారే అనుభవిస్తున్నారు. అదేమని అడిగితే మాపై దౌర్జన్యం చేస్తున్నారు. దీనిపై గతంలో ఎమ్మార్వో కార్యా లయంలో ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించలేదు. వృద్ధాప్యంతో అధికారుల చుట్టూ తిరగలేకపోతున్నా. కలెక్టర్ స్పందించి మా 11 సెంట్ల భూమిని అప్పగించాలని కోరుతున్నా.
– పరిమళ్ల కోటేశ్వరరావు,
వీరులపాడు మండలం
Comments
Please login to add a commentAdd a comment