సొరంగానికి మరమ్మతులు
ప్రమాదరహితంగా తీర్చిదిద్దేందుకు వీఎంసీ ప్రణాళిక
వన్‌టౌన్ నుంచి భవానీపురం, గొల్లపూడి, విద్యాధరపురం ప్రాంతాలకు వెళ్లే వారికి సొరంగ మార్గం ఎంతో అనువుగా ఉంటుంది. నిత్యం వందలాది మంది సొరంగం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి విశిష్టత కలిగిన సొరంగం రాబోయే తరాలకు కూడా సేవలు అందించేలా పతిష్టంగా చేయాలని పనులు చేపట్టారు. సొరంగం కొండపై ఉన్న పలు నివాసాలను తొలగించాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇప్పటికే పలు మార్లు కొండ ప్రాంతంలో పర్యటించిన కార్పొరేషన్ అధికారులు త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సొరంగం కొండకు ఇరువైపులా సుమారు 40 ఇళ్లను తొలగించాలని కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం గుర్తించి, ఆయా ఇళ్లకు మార్కింగ్ చేశారు. దీంతో పాటు ఆయా నివాసితులతో మాట్లాడి వారి నుంచి అనుమతి పత్రాలను తీసుకున్న తర్వాత పునరావాసంపై ఆలోచన చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): అరవై ఏళ్ల చరిత్ర కలిగిన చిట్టినగర్ సొరంగాన్ని పటిష్ట పరిచేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. గత కొన్ని నెలలుగా సొరంగంలో వస్తున్న నీటి ఊట ఇప్పుడు ధారలుగా కిందకు కారుతోంది. దీంతో సొరంగ మీదుగా ప్రయాణం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అలాగే కొండపై నుంచి తరచూ రాళ్లు, మట్టి జారిపడటంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో రంగంలోని దిగిన కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు సొరంగం పటిష్టత దెబ్బతినకుండా, అదే సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు కార్యాచరణ రూపొందించారు.
ప్రమాదాలకు నిలయంగా..
ఇక ఇటీవల సొరంగం లోపల నీటి ఊట వస్తున్న ప్రాంతంలో నివారణ చర్యలు చేపట్టారు. సొరంగం మధ్య నుంచి వస్తున్న నీటి ధారలు రోడ్డు మధ్యలో పడటం, ఆ ప్రాంతమంతా బురదమయంగా మారి వాహన చోదకులు జారిపడుతున్న ఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకున్నాయి. తరచూ సొరంగంలో రోడ్డు ప్రమాదాల జరిగిన అనేక మంది గాయాలు పాలు కావడంతో పాటు పలువురు మృతి చెందిన ఘటనలు జరిగాయి. దీంతో కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగి సొరంగంలో నీటి ఉట, నీటి ధారలు రాకుండా ఉండేందుకు అవసరమైన పనులు చేపట్టారు. సొరంగం కొండపై ఉన్న నివాసాలను పరిశీలించి, చర్యలకు సిద్ధపడ్డారు.
భారీ వాహనాల రాకపోకలు నిషేధిస్తే..
సొరంగం నుంచి భారీ వాహనాల రాకపోకలను నిషేధించినట్లయితే కొంత మేర ఫలితం ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. పగటి వేళ కాలేజీ, స్కూల్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే వాటి వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా, రాత్రి వేళ టన్నుల బరువుతో లారీలు, టిప్పర్లు మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్ల సొరంగం కొండ కంపిస్తోందని పేర్కొంటున్నారు.
నీటి ధారలు అరికట్టేందుకు చర్యలు కొండపై ఇళ్లను తొలగించాలని సూచన త్వరలోనే నివాసితుల తరలింపు
పలు ఇళ్లకు మార్కింగ్..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనూ పనులు..
సొరంగం దెబ్బతినకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కొన్ని పనులు చేపట్టింది. సొరంగానికి అవతలి వైపున కొండకు ఇరువైపులా రాళ్లు జారి పడుకుండా రూ. లక్షల వ్యయంతో ఐరన్ మెష్ ఏర్పాటు చేయించింది. కొండపై ప్రమాదకరంగా ఉన్న చెట్లు, కొండ చరియలను తొలగింపు పనులు పలుమార్లు నిర్వహించింది.
సొరంగానికి మరమ్మతులు
Comments
Please login to add a commentAdd a comment